నిబద్ధత కలిగిన కమ్యూనిస్టు.. ప్రసాద్
ఖమ్మంమయూరిసెంటర్: విద్యార్థి, యువజన, కార్మిక ఉద్యమాలతో పాటు సీపీఐ జిల్లా కార్యదర్శిగా ప్రజా సమస్యలపై ఎన్నో పోరాటాలకు నాయకత్వం వహించిన ఘనత పోటు ప్రసాద్‌కు దక్కుతుందని పార్టీ జాతీయ సమితి సభ్యుడు బాగం హేమంతరావు అన్నారు. ఖమ్మంలోని జమ్మిబండ సమీపాన పోటు ప్రసాద్ స్మారకస్తూపం వద్ద గురువారం ఆయన ప్రథమ వర్ధంతి సభ నిర్వహించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్‌తో కలిసి నివాళులర్పించాక కార్పొరేటర్ బిజి. క్లెమెట్ అధ్యక్షతన జరిగిన సభలో హేమంతరావు మాట్లాడారు. పోటు ప్రసాద్ నిబద్ధత కలిగిన కమ్యూనిస్టు అని కొనియాడారు. ప్రజల సమస్యల పరిష్కారానికి పాటుపడుతూనే పార్టీ విస్తరణకు కృషి చేశారని గుర్తు చేశారు. సీపీఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు సభ ఏర్పాట్లను ప్రసాద్ అప్పట్లోనేసిద్ధం చేశారని తెలిపారు. నాయకులు జమ్ముల జితేందర్‌రెడ్డి, షేక్ జానీమియా, తోట రామాంజనేయులు, పగడాల మల్లేశ్, పోటు కళావతి, వరద నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు.
వర్ధంతి సభలో బాగం హేమంతరావు


