అవకాశం ఇస్తే ఆకాశమే హద్దు..
ఖమ్మం సహకారనగర్: బాలికలకు చదువుకునే అవకాశం కల్పించాలని, తద్వారా వారు అన్ని రంగాల్లో ఆకాశమే హద్దుగా ఎదిగే అవకాశముంటుందని డీఐఈఓ రవిబాబు తెలిపారు. ఖమ్మం ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో గురువారం ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్ ఆధ్వర్యాన యాక్షన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ అసోసియేషన్(ఏఐడీ) సంస్థ బాధ్యులు బాల్య వివాహాల నివారణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో సీడబ్ల్యూసీ చైర్‌పర్సన్ భారతిరాణి, డీఐఈఓ రవిబాబు, డీఈఓ చైతన్య జైనీ, డీడబ్ల్యూఓ విజేత పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఐఈఓ తదితరులు మాట్లాడుతూ బాల్యవివాహాలతో అనేక అనర్థాలు ఎదురవుతాయని తెలిపారు. ఈ విషయంలో తల్లిదండ్రులు అవగాహన పెంచుకుని విద్యార్థినులను చదివించాలని సూచించారు.కళాశాల ప్రిన్సిపాల్ బి.అరుణ్‌కుమార్, ఎన్‌ఎస్‌ఎస్ పీఓలు చంద్రకళ, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.


