నాణ్యమైన విద్య అందించండి
ఖమ్మం సహకారనగర్: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తూ వారు ఉన్నతస్థాయికి చేరేలా ఉపాధ్యాయులు చేయూతనివ్వాలని జిల్లా విద్యాశాఖాధికారి చైతన్య జైనీ సూచించారు. కలెక్టరేట్‌లో గురువారం ఆమె జిల్లాలోని 28 పీఎంశ్రీ పాఠశాలల హెచ్‌ఎంలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పాఠ్య, సహపాఠ్య కార్యక్రమాల్లో ముందు నిలిచేలా చూడాలని తెలిపారు. విజ్ఞాన యాత్రలకు తీసుకెళ్లడమే కాక శాస్త్ర, సాంకేతికం, పరిశోధన, అభివృద్ధి రంగాలపై మక్కువ పెరిగేలా అవగాహన కల్పించాలని సూచించారు. వివిధ విభాగాల కోఆర్డినేటర్లు రామకృష్ణ, పెసర ప్రభాకర్‌రెడ్డి, రూబీ, ఎంఈఓలు వీరస్వామి, వెంకటేశ్వర్లు, నివేదిత, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
●తల్లిని మరిపించేలా పాఠశాలల్లో బోధన సాగాలని డీఈఓ చైతన్య జైనీ అన్నారు. ఖమ్మం డైట్ కళాశాలలో ప్రీ ప్రైమరీ ఇన్‌స్ట్రక్టర్లకు ఇస్తున్న శిక్షణను ఆమె పరిశీలించి మాట్లాడారు. పిల్లలతో మమేకమవుతూ బోధన చేయాలని, తద్వారా తొలి గురువుగా పిల్లలు గుర్తు ఉంచుకుంటారని తెలిపారు. ఏఎంఓ పెసర ప్రభాకర్‌రెడ్డి, రిసోర్స్ పర్సన్లు ప్రవీణ్‌కుమార్, శ్రవణ్‌కుమార్, జీవన్‌కుమార్, అనిల్‌కుమార్ పాల్గొన్నారు.
డీఈఓ చైతన్య జైనీ


