డిప్యూటీ డీఎంహెచ్‌ఓగా వేణుమాధవరావు
ఖమ్మంవైద్యవిభాగం: ఖమ్మం డిప్యూటీ డీఎంహెచ్‌ఓగా డాక్టర్ వేణుమాధవరావు నియమితులయ్యారు. ఈ మేరకు ఆయన బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం వేణుమాధవరావు లెప్రసీ విభాగంలో డిస్ట్రిక్ట్ న్యూక్లియస్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. సివిల్ అసిస్టెంట్ సర్జన్‌గా ఉన్న ఆయనకు డిప్యూటీ సివిల్ సర్జన్‌గా పదోన్నతి కల్పించి డిప్యూటీ డీఎంహెచ్‌ఓగా నియమించడంతో విధుల్లో చేరారు. అలాగే, జిల్లాకు ఇద్దరు ప్రోగ్రామ్ అధికారులను కూడా కేటాయించారు.
ఆలయానికి వెండి శఠారీ, ప్లేటు వితరణ
ఖమ్మంఅర్బన్: ఖమ్మం ఇందిరానగర్ జంక్షన్‌లోని బాలగణపతి ఆలయానికి భక్తులు రూ.60 వేల విలువైన వెండి శటారీ, ప్లేటు బుధవారం అందజేశారు. ఖమ్మంకు చెందిన బండారు నరసరావు–జ్యోతి, తరుణ్, కౌశిక్, అనూష వీటిని అందజేశారని ఆలయ అధ్యక్షుడు బాజిన్ని వీరయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో అర్చకులు గిరిధర్, సభ్యులు తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.
30న కల్లూరులో
యూటీఎఫ్ జిల్లా సమావేశం
ఖమ్మంసహకారనగర్: కల్లూరులో ఈ నెల 30న టీఎస్ యూటీఎఫ్ జిల్లా కమిటీ సమావేశం నిర్వహిస్తున్నట్లు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షేక్ రంజాన్, పారుపల్లి నాగేశ్వరరావు తెలిపారు. కల్లూరులో బుధవారం సమావేశాల పోస్టర్లు ఆవిష్కరించి మాట్లాడారు. సమావేశానికి యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదిమూలం వెంకట్, రాష్ట్ర ఉపాధ్యక్షులు చావా దుర్గాభవానితో పాటు ముఖ్య అతి థిగా ఎమ్మెల్యే మట్టా రాగమయి హాజరవుతారని తెలిపారు. సమావేశంలో నాయకులు బుర్రి వెంకన్న, షమీ, వల్లంకొండ రాంబాబు, పి.సురేశ్, ఉద్దండు షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.
డిప్యూటీ డీఎంహెచ్‌ఓగా వేణుమాధవరావు


