‘చాంబర్’ ప్రతినిధుల బాధ్యతల స్వీకరణ
ఖమ్మంగాంధీచౌక్: ఖమ్మం చాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల్లో విజేతలుగా నిలిచిన ప్రతినిధులు బుధవా రం బాధ్యతలు స్వీకరించారు. అధ్యక్షుడిగా కురువెళ్ల ప్రవీణ్‌కుమార్, ప్రధాన కార్యదర్శి సోమ నరసింహారావు(జీవై నరేశ్), ఉపాధ్యక్షుడిగా బత్తిని నరసింహారావు, సహాయ కార్యదర్శిగా బాదె రమేశ్, కోశాధ్యక్షుడిగా తల్లాడ రమేశ్‌తో పాటు సెంట్రల్ ఈసీ సభ్యులుగా మాటేటి కిరణ్‌కుమార్, రాయపూడి రవికుమార్, వంగవీటి హరీశ్, సుఖాసీ శేషగిరిరావు, పోట్ల రామనాథం బాధ్యతలు స్వీకరించారు. చాంబర్ మాజీ అధ్యక్షుడు చిన్ని కృష్ణారావు, కొప్పు నరేశ్‌కుమార్, మెంతుల శ్రీశైలం, గుర్రం ఉమామహేశ్వరరావు, భద్రాద్రి బ్యాంకు చైర్మన్ చెరుకూరి కృష్ణమూర్తి, ఖమ్మం మార్కెట్ మాజీ చైర్మన్ గుండాల కృష్ణతోపాటు పారా నాగేశ్వరరావు తదితరులు వారిని సన్మానించారు. అలాగే, దిగుమతి శాఖ అధ్యక్ష, కార్యదర్శులుగా వడ్డే వెంకటేశ్వర్లు, ఎర్రా అప్పారావుతో పాటు కార్యవర్గ సభ్యులు సారిక పాపారావు, మల్లెల అప్పారావు, బండి సతీశ్, జంగిలి రమణ, సిరికొండ వెంకటేశ్వర్లు, సాదె శంకర్, జుట్టకొండ చైతన్య, బాల సన్మద్‌కుమార్, రావుల శ్రీనివాసరావు, కందిబండ నరసింహారావు కూడా ఖమ్మం మార్కెట్ వద్ద కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు.


