 
															వాతావరణ ం
గరిష్టం / కనిష్టం
300 / 200
జిల్లాలోని పలు ప్రాంతాల్లో గురువారం వర్షసూచనలు ఉన్నాయి. రోజంతా ఆకాశం మేఘావృతమై చల్లని గాలులు వీస్తాయి.
ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న వర్షాలతో వైరా రిజర్వాయర్‌లోకి భారీగా వరద చేరుతోంది. వైరా రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటి మట్టం 18.3 అడుగులు కాగా, ఒకే రోజులో 18.1 అడుగుల నుంచి 20అడుగులకు చేరింది. రిజర్వాయర్‌లోకి 4,678 క్యూసెక్కుల వరద వస్తుండగా, ఐదు అలుగుల ద్వారా 4,548 క్యూసెక్కుల నీరు బయటకు వెళ్తోంది. ఇక వైరాలో ఎడతెరిపి లేకుండా వర్షం కారణంగా పలు రహదారులు జలమయం అయ్యాయి. రాజీవ్ నగర్, ఇందిరమ్మ కాలనీల్లోకి వరద చేరగా, ఠాగూర్ విద్యాలయం సమీపాన చేరుతున్న వరదను మున్సిపల్ కమిషనర్ గురులింగం ఆధ్వర్యాన సిబ్బంది వెళ్లి జేసీబీతో కాల్వలు తీసి మళ్లించారు. అలాగే, ముంపు ప్రాంతాల్లో ఎస్సై రామారావు పర్యటించి స్థానికులను అప్రమత్తం చేశారు. – వైరా

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
