 
															మున్నేరు ఉధృతి
ఖమ్మం నగరంతో పాటు ఎగువన ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో మున్నేటిలోకి వరద చేరి ఉధృతంగా ప్రవహిస్తోంది. కాల్వొడ్డు వద్ద బుధవారం మధ్యాహ్నం 12గంటలకు 10 అడుగుల మేర మాత్రమే ప్రవహించిన వరద రాత్రి 7గంటలకల్లా 18.50 అడుగులకు చేరింది. ఏడు గంటల్లోనే 8అడుగులకు మించి వరద పెరగడంతో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య పరీవాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. అప్పటికప్పుడు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయించి బొక్కల గడ్డ, గంగాభవాని గుడి ప్రాంతం, ధంసలాపురంలో కొందరు ప్రజలను సామగ్రితో సహా పంపించారు. రాత్రికి వరద మరింత పెరగడంతో కేఎంసీ సహా వివిధ శాఖల ఉద్యోగులు ప్రజలను అప్రమత్తం చేశారు. – స్టాఫ్ ఫొటోగ్రాఫర్
 
							మున్నేరు ఉధృతి

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
