అరుణాచలానికి ప్రత్యేక బస్సు
ఖమ్మంమయూరిసెంటర్: వచ్చేనెల 5న కార్తీక పౌర్ణమి సందర్భంగా అరుణాచలం వెళ్లే భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక సూపర్ లగ్జరీ సర్వీస్ ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్టీసీ ఖమ్మం రీజియన్ మేనేజర్ సరిరామ్ తెలిపారు. ఈ బస్సులో 36 పుష్‌బ్యాక్ సీట్లు ఉండగా, ఖమ్మం బస్‌స్టేషన్ నుంచి నవంబర్ 3వ తేదీ సాయంత్రం 7 గంటలకు బయలుదేరుతుందని పేర్కొన్నారు. నవంబర్ 4వ తేదీ ఉదయం కాణిపాకంలో వినాయకుడి దర్శనం, గోల్డెన్ టెంపుల్(వెల్లూరు) దర్శనం అనంతరం అరుణాచలంలో గిరి ప్రదక్షిణ, శ్రీ స్వామి దర్శనం ఉంటుందని తెలిపారు. టికెట్ ధర పెద్దలకు రూ.5వేలు, పిల్లలకు రూ.2,530గా నిర్ణయించినట్లు వెల్లడించారు. వివరాలకు 91364 46666, 99592 25979, 99592 25965 నంబర్లలో సంప్రదించాలని ఆర్‌ఎం సూచించారు.


