
టీసీఏ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ప్రదీప్, వీరేష్
ఖమ్మం స్పోర్ట్స్: తెలంగాణ క్రికెట్ అసోసియేషన్(టీసీఏ) జిల్లా అధ్యక్షుడిగా డాక్టర్ కూరపాటి ప్రదీప్‌కుమార్ నియమితులయ్యారు. అలాగే, జిల్లా ప్రధాన కార్యదర్శిగా జి.వీరేష్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధరం గురవారెడ్డి ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆదివారం ఖమ్మం వచ్చిన అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ విజయచందర్‌రెడ్డి డాక్టర్ ప్రదీప్, వీరేశ్‌గౌడ్‌ను సన్మానించారు. అనంతరం మాట్లాడుతూ గ్రామీణ క్రికెటర్లను ప్రోత్సహించడానికి టీసీఏ ఎప్పుడూ ముందుంటుందని తెలిపారు. జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ప్రదీప్, వీరేష్ మాట్లాడుతూ తమ నియామకానికి సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. కాగా, జిల్లాలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా క్రికెటర్ల ఎంపిక చేపడతామని వెల్లడించారు.

టీసీఏ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ప్రదీప్, వీరేష్