
అదనపు కోర్టులు ఏర్పాటుచేయండి
బూర్గంపాడు/కొత్తగూడెంటౌన్ : ప్రజల సౌలభ్యం కోసం భద్రాచలంలో అదనపు సెషన్స్ కోర్టు లేదా అసిస్టెంట్ సెషన్స్ కోర్టును, కొత్తగూడెంలో ఎస్సీ, ఎస్టీ కేసుల కోసం ప్రత్యేక న్యాయస్థానాన్ని, ఫ్యామిలీ కోర్టు, జువైనల్ జస్టిస్ బోర్డులు ఏర్పాటు చేయాలని కొత్తగూడెం, భద్రాచలం బార్ అసోసయేషన్ల సభ్యులు రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జె. శ్రీనివాసరావును కోరారు. సారపాక ఐటీసీ గెస్ట్‌హౌస్‌లో భద్రాచలం బార్ సభ్యులు, కొత్తగూడెం కోర్టులో స్థానిక బార్ అసోసియేషన్ సభ్యులు ఈ మేరకు జడ్జికి వినతిపత్రాలు అందించారు. భద్రాచలం, మణుగూరు సబ్ డివిజన్లలో 600 పైగా సెషన్స్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, జిల్లా కేంద్రం కొత్తగూడెం వెళ్లాలంటే ఈ ప్రాంత వాసులకు అసౌకర్యంగా ఉందని వివరించారు. ఆ తర్వాత కొత్తగూడెం బార్ అసో సియేషన్ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ తదితరులు శ్రీనివాసరావును సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా జడ్జి పాటిల్ వసత్, అదనపు జిల్లా జడ్జి సరిత, సీని యర్ జడ్జిలు ఎం.రాజేందర్, కె.కిరణ్‌కుమార్, అదనపు సీనియర్ సివిల్ జడ్జి కె.కవిత, జూనియర్ జడ్జిలు కె.సాయిశ్రీ, బి.రవికుమార్, వి.శివనాయక్, డి.కీర్తిచంద్రికారెడ్డి బి.భవాని, కె.సురారెడ్డి, భద్రాచలం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కోట దేవదానం, ప్రధాన కార్యదర్శి పూసాల శ్రీనివాసాచారి, సభ్యులు జె.గోపీకృష్ణ, భాగం మాధవరావు, కాసాని రమేష్, ఉప్పు ఆరుణ్, ఆడపాల పార్వతి, మాలోత్ ప్రసాద్, కె.చిన్నికృష్ణ, కొడాలి శ్రీనివాసన్, పసుపులేటి రాంబాబు, రామకృష్ణ, సురేష్ పాల్గొన్నారు.
హైకోర్టు జడ్జికి ‘బార్’ సభ్యుల విన్నపం