
భద్రాద్రి డీపీఓగా అనూష
చుంచుపల్లి: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన గ్రూప్–1 ఫలితాల్లో 62వ ర్యాంకుతో జిల్లా పంచాయతీ అధికారి(డీపీఓ) పోస్టుకు ఎంపికై న బొప్పన అనూషను భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు కేటాయించారు. ఈమేరకు ఆమెను డీపీఓగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం ఆరు జిల్లాలకు డీపీఓలను నియమించగా జాబితాలో ఖమ్మంకు చెందిన అనూష కూడా ఉన్నారు.
ఐటీడీఏకు ఉత్తమ అవార్డు
భద్రాచలంటౌన్: భద్రాచలం ఐటీడీఏ పరిధిలోని గ్రామాల్లో కేంద్ర పథకాలను విజయవంతంగా అమలు చేసినందుకు గాను కేంద్ర ప్రభుత్వం బెస్ట్ ఐటీడీఏ అవార్డుకు ఎంపిక చేసింది. ఈ మేరకు పీఓ రాహుల్ శనివారంఒక ప్రకటన ద్వారా వెల్లడించారు. ధర్తీ ఆభా జాన్‌జాతీయ గౌరవ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఐటీడీఏ పరిధిలోని 19 మండలాల్లో గల 130 గ్రామాల్లో ఆదికర్మయోగి అభియాన్ కార్యక్రమం ప్రా రంభించామని, ఈ మేరకు గిరిజన సంక్షేమ, విద్యా, వైద్య, గ్రామీణాభివృద్ధి శాఖలను సమన్వయం చేస్తూ పనులు చేపట్టామని వివరించారు. విజన్ 2030 నాటికి ఆయా గ్రామాలు అభివృద్ధి పథంలో నడిచేలా ఆన్ని శాఖ లను అప్రమత్తం చేశామని వివరించారు. అవార్డు ప్రకటన పట్ల హర్షం వ్యక్తం చేసిన పీఓ.. ఆది కర్మయోగి అభియాన్ కార్యక్రమంలో ప్రతిభ చాటిన ప్రతీ ఒక్కరికి అభినందనలు తెలిపారు.
పెద్దమ్మతల్లి ఆలయంలో
నేడు రుద్రహోమం
పాల్వంచరూరల్: మండల పరిధిలో కొలువుదీరిన శ్రీ పెద్దమ్మతల్లి ఆలయంలో మాస శివరాత్రి సందర్భంగా ఆదివారంరుద్రహోమంనిర్వహించనున్నట్లుఈఓ ఎన్. రజనీకుమారి శనివారం ఒక ప్రకటనలో తెలిపా రు. పాల్గొనే భక్తులు రూ.1,516 చెల్లించి గోత్రనామాలు నమోదు చేసుకోవాలని కోరారు. వివరాలకు 63034 08458 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.