
నాణ్యమైన బొగ్గుతోనే సింగరేణికి పేరు
సింగరేణి(కొత్తగూడెం): వినియోగదారులకు నాణ్య మైన బొగ్గు అందించడం ద్వారా సింగరేణి పేరు నిలుస్తుందని సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(కోల్ మూవ్‌మెంట్), చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ బాదావత్ వెంకన్న తెలిపారు. కొత్తగూడెం ఏరియాలోని వీకే–7 ఓసీ, ఓసీ సీహెచ్‌పీ పనులను ఆయన శనివారం తనిఖీ చేశారు. రుద్రంపూర్ ప్రాంతంలోని మాయాబజార్ వద్ద నిర్మించే సీహెచ్‌పీ ప్లాన్‌పై ఆరా తీశారు. నవంబర్‌లో వీకే–7 ఓసీ మొదలైతే బొగ్గు ఉత్పత్తి, రవాణా మెరుగుపడుతుందని తెలిపారు. ఆ తర్వాత వ్యాగన్ లోడింగ్ పాయింట్, పీవీకే బంకర్, రుద్రంపూర్ కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్‌కు సత్తుపల్లి ఓసీల నుంచి వచ్చే బొగ్గు నాణ్యతను పరిశీలించారు. అనంతరం పీవీకే–5 గనిని ఈడీ సందర్శించారు. ఏరియా జీఎం శాలేం రాజు, ఏరియా ఇంజనీర్ కె.సూర్యనారాయణ రాజు, అధికారులు రామకృష్ణ, శ్రీరమేష్, ఖనిరామ్ భరోసే మహతో, వి.శ్యాంప్రసాద్ పాల్గొన్నారు.