
పత్రికా స్వేచ్ఛను హరించొద్దు
IIలో
పత్రికా స్వేచ్ఛను కాపాడాలని పాత్రికేయలోకం డిమాండ్ చేసింది. ఇటీవల
ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన కల్తీ మద్యం వ్యవహారంపై ‘సాక్షి’ పత్రికలో కథనాలు
ప్రచురితమయ్యాయి. దీంతో ‘సాక్షి’ యాజమాన్యంతో పాటు ఎడిటర్
ఆర్.ధనంజయరెడ్డి, జర్నలిస్టులపై ఏపీ ప్రభుత్వం అక్రమంగా
కేసులు పెట్టింది. సంస్థ కార్యాలయాల్లోకి జొరబడి నిర్బంధ విచారణ సాగిస్తోంది. తరచూ నోటీసులు జారీ చేస్తూ
భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో జిల్లాలో
శుక్రవారం జర్నలిస్టులు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు ఆందోళన చేపట్టారు. నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాలు సమర్పించారు. సాక్షి పత్రికపై ఏపీ ప్రభుత్వం కక్ష గట్టి వ్యవహరిస్తున్న తీరును ఖండించారు. పత్రికా స్వేచ్ఛను హరిస్తే ప్రభుత్వాలకు మనుగడ ఉండదని, తప్పిదాలను ఎత్తి చూపితే
సరిచేసుకోవాలే కానీ నేరంగా భావించకూడదని పేర్కొన్నారు. సాక్షి ఎడిటర్, ఇతర జర్నలిస్టులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.