
సభకు సీపీఐ శ్రేణులను సిద్ధం చేయండి
ఖమ్మంమయూరిసెంటర్/చింతకాని: సీపీఐ శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని డిసెంబర్ 26న జరిగే భారీ బహిరంగ సభకు సంబంధించి పార్టీ శ్రేణులను సిద్ధం చేయాలని జిల్లా కార్యదర్శి దండి సురేష్ కోరారు. ఈమేరకు జిల్లాలోని ప్రతీ ఇంటికి శతాబ్ది ఉత్సవాల సందేశాన్ని అందించాలని ఆయన తెలిపారు. ఖమ్మం గిరిప్రసాద్ భవన్‌లో శుక్రవారం నగర కార్యదర్శి ఎస్.కే.జానీమియా అధ్యక్షతన జరిగిన సమావేశంతో పాటు చింతకానిలో చాట్ల రమేష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సురేష్ మాట్లాడారు. పార్టీ ప్రస్థానంలో అనేక విజయాలు ఉన్నాయని, వీటిని నేటి తరానికి తెలియజేసే లక్ష్యంతో శతాబ్ది ఉత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. సీపీఐ అగ్రనాయకత్వంతో పాటు 40దేశాల ప్రతినిధులు హాజరయ్యే సభ ప్రాధాన్యతను ప్రజలకు వివరించాలని సురేష్ కోరారు. ఈ సమావేశాల్లో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి జమ్ముల జితేందర్‌రెడ్డి, రాష్ట్ర సమితి సభ్యుడు మహ్మద్ సలాం, నాయకులు కొండపర్తి గోవిందరావు, పగడాల మల్లేష్, మేకల శ్రీనివాసరావు, యానాలి సాంబశివరెడ్డి, ఏనుగు గాంధీ, నూనె శశిధర్, తాటి నిర్మల, వరదా నర్సింహారావు, బోడా వీరన్న, సైదా, రవికుమార్, కూచిపూడి రవి, దూసరి శ్రీరాములు, దూసరి గోపాలరావు, మార్గం శ్రీను, అబ్బూరి మహేష్, దొబ్బల వెంగళరావు తదితరులు పాల్గొన్నారు.