
కన్నపేగు దూరమై.. కన్నీరుమున్నీరై..
కుమారుడి మృతి తట్టుకోలేక తల్లి కన్నుమూత
ఖమ్మంఅర్బన్: కుమారుడు మృతి చెందాడని తెలిసినప్పటి రోదిస్తున్న తల్లి.. ఆయన అంత్యక్రియలు పూర్తిచేసి ఇంటికి చేరిన కొద్దిసేపటికే కన్నుమూసింది. పేగు బంధాన్ని దూరం చేసుకున్న ఆ వృద్ధురాలు ఆవేదనను తట్టుకోలేక మృతి చెందిన విషాద ఘటన ఇది. ఖమ్మంలోని రామన్నపేట డబుల్ బెడ్‌రూం కాలనీకి చెందిన మునగంటి నాగాచారి అనారోగ్య సమస్యల కారణంగా గురువారం రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఏౖకైక కుమారుడి మృతి విషయం తెలిసినప్పటి ఆయన తల్లి రంగమ్మ(75) కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. కాగా, పోస్టుమార్టం అనంతరం శుక్రవారం నాగాచారి మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చాక అంత్యక్రియలకు తీసుకెళ్లారు. ఆతర్వాత అందరితో పాటే ఇంటికి వచ్చిన రంగమ్మ తీవ్ర వేదనతో రోదిస్తూ కుప్పకూలి మృతి చెందింది. రోజు వ్యవధిలోనే తల్లీకొడుకు మృతి చెందగా ఆ కుటుంబంతో పాటు గ్రామంలో విషాదం నెలకొంది.

కన్నపేగు దూరమై.. కన్నీరుమున్నీరై..