
కదం తొక్కిన జర్నలిస్టులు
అక్రమ కేసులు గర్హనీయం
● ‘సాక్షి’ పత్రిక, ఎడిటర్‌పై అక్రమ కేసులకు నిరసన ● ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు ● పార్టీలు, సంఘాలకు అతీతంగా నాయకుల మద్దతు
మధిర: ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకురావడం, పాలకుల తప్పులను ఎత్తిచూపడం బాధ్యతగా భావించే మీడియా గొంతు నొక్కాలని, స్వేచ్ఛను హరించివేయాలని కుట్ర పన్నిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీరు గర్హనీయమని వివిధ పార్టీలు, సంఘాలతో పాటు జర్నలిస్టు సంఘాల నాయకులు పేర్కొన్నారు. ‘సాక్షి’ ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డిపై అక్రమ కేసులు బనాయించడమే కాక పత్రికకు నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ శుక్రవారం మధిర అంబేడ్కర్ సర్కిల్‌లో జరిగిన నిరసనలో జర్నలిస్టులు, పార్టీలు, సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రభుత్వ అవినీతిని ప్రజల ముందు ఉంచడమే తప్పుగా ‘సాక్షి’పై అక్రమ కేసులు బనాయిస్తూ మీడియా గొంతు నొక్కేలా ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. అనంతరం తహసీల్ వరకు ర్యాలీకి వెళ్లి కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, బీఆర్‌ఎస్, బీజేపీ, ఎమ్మార్పీఎస్ నాయకులు మిరియాల వెంకటరమణ గుప్తా, తూమాటి నవీన్‌రెడ్డి, బెజవాడ రవిబాబు, మడుపల్లి గోపాలరావు, చిత్తారు నాగేశ్వరరావు, చిలివేరు సాంబశివరావు, కుంచం కృష్ణారావు, ఏనోకు మాదిగ, కనకపూడి శీను మాదిగ, మధిర ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు పాగి బాలస్వామి, గౌరవ అధ్యక్షుడు మక్కెన నాగేశ్వరరావుతో పాటు జర్నలిస్టులు అట్లూరి సాంబిరెడ్డి, చేకూరి వినోద్, పల్లపోతు ప్రసాదరావు, సురభి వెంకన్న, గంధం శ్రీనివాసరావు, కాశిబోయిన రామారావు, కందిమళ్ల వీరస్వామి, మిరియాల శ్రీనివాసరావు, శ్రీరామోజు యోగేష్, రావిరాల శశికుమార్, ధనిశెట్టి శ్రీనివాసరావు, తాళ్లూరి అప్పారావు తదితరులు పాల్గొన్నారు.
సత్తుపల్లి: ప్రతికా స్వేచ్ఛపై దాడి చేయడమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం వ్యవహరించడం దురదృష్టకరమని వక్తలు పేర్కొన్నారు. ‘సాక్షి’ ఎడిటర్ ధనుంజయరెడ్డిపై వరుసగా ఏపీ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టడం గర్హనీయమన్నారు. ఈమేరకు సత్తుపల్లి అంబేడ్కర్ విగ్రహం వద్ద శుక్రవారం జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యాన నిరసన తెలిపారు. ఈ సందర్భంగా తోట కిరణ్(టీయూడబ్ల్యూజే–టీజేఎస్), మాచినేని బాలకృష్ణ(టీడబ్లూయజే–ఐజేయూ) మాట్లాడుతూ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ప్రతికా స్వేచ్ఛను హరించడమేనని మండిపడ్డారు. జర్నలిస్టు సంఘాల ఐక్యతతోనే ప్రభుత్వాల నియంతృత్వ పోకడలను అడ్డుకోవచ్చని తెలిపారు. బీసీ సంఘం, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, మాస్‌లైన్, ఎమ్మార్పీఎస్, వడ్డెర సంఘం, లంబాడీ హక్కుల సంఘం నాయకులు నారాయణవరపు శ్రీనివాస్, గాదె చెన్నారావు, దండు ఆదినారాయణ, సర్వేశ్వరరావు, అమర్లపూడి శరత్, పిల్లి మల్లికార్జున్, శ్రీనివాసరావు, తన్నీరు జమలయ్య, నందునాయక్‌తో పాటు మసీద్ కమిటీ, లయన్స్‌క్లబ్ బాధ్యులు ఎం.డీ.కమల్‌పాషా, రవి, మందపాటి ప్రభాకర్‌రెడ్డి సంఘీభావం తెలిపారు. జర్నలిస్టులు ఎం.డీ.షైబుద్దీన్, భీమిశెట్టి రఘురామారావు, ఎస్.కే.ఖాదర్‌బాబా, బీ.వీ.రామారావు, జీడిమళ్ల శ్రీనివాసరావు, కొవ్వూరు సాంబశివరావు, బొర్ర కోటేశ్వరరావు, గోపరాజు గోపి, నర్రా అరుణ్, బాబు, రామిశెట్టి లక్ష్మణ్‌రావు, శ్రీకాంత్, ఐ.శ్రీనివాసరావు, సతీష్, ఎస్.కే.మీరా, బాజీ, సురేష్, మహా శ్రీనివాస్, తడికమళ్ల అప్పారావు, గురవయ్య, కొత్తపల్లి సుధాకర్, చీపు గంగాధర్, లింగగిరి రామకృష్ణ, కాకర్ల జగన్, ఎస్.కే.మునీర్, బల్లెం చిరంజీవి, జంగం కిరణ్, అశోక్, ఎండి మేరాజ్, బేతి ఆనంద్, బేతి సునీత, రాము తదితరులు పాల్గొన్నారు.

కదం తొక్కిన జర్నలిస్టులు

కదం తొక్కిన జర్నలిస్టులు