నిమ్మతోటల్లో సస్యరక్షణ చర్యలు | - | Sakshi
Sakshi News home page

నిమ్మతోటల్లో సస్యరక్షణ చర్యలు

Oct 18 2025 6:43 AM | Updated on Oct 18 2025 6:43 AM

నిమ్మ

నిమ్మతోటల్లో సస్యరక్షణ చర్యలు

వేంసూరు: నిమ్మ తోటలను చీడపీడలు ఆశిస్తున్నందున రైతులు సస్యరక్షణ చర్యలు చేపట్టా లని జిల్లా ఉద్యాన అధికారి ఎంవీ.మధుసూదన్‌ సూచించారు. వేంసూరు మండలం రాయుడుపాలెంలో పలువురు రైతులు సాగు చేస్తున్న నిమ్మ తోటలను ఆయన శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మధుసూదన్‌ మాట్లాడుతూ రాష్ట్రీయ కృషి విసక్‌ యోజన పథకంలో భాగంగా సిమెంట్‌ స్తంభాలు పాతి తీగ జాతి పంటల సాగుకు అవకాశముందని తెలిపారు. ఎకరాకు రూ.లక్ష మేర సబ్సిడీ అందనున్నందున రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మండల ఉద్యాన అధికారి శ్రావణి, రైతులు పాల్గొన్నారు.

అందరి ఆమోదంతోనే ఎన్నిక

మధిర/చింతకాని: పార్టీ కార్యకర్తల అభీష్టం, అభిప్రాయాల మేరకే జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి నేతలను ఎంపిక చేస్తామని ఏఐసీసీ పరిశీలకులు మహేంద్రన్‌ స్పష్టం చేశారు. మధి ర, చింతకాని మండలం నాగులవంచలో శుక్రవారం వేర్వేరుగా జరిగిన సమావేశాల్లో ఆయ న పాల్గొన్నారు. ఈసందర్భంగా మధిర నియోజకవర్గంలోని మధిర,బోనకల్‌, ఎర్రుపాలెం, చింతకాని, ముదిగొండ మండలాల నాయకులు, కార్యకర్తల నుంచి అభిప్రాయాలు సేకరించారు. అనంతరం మహేంద్రన్‌ మాట్లాడుతూ పార్టీ కోసం కష్టించిన నాయకులకే పదవి దక్కుతుందని.. ఈ ఎంపిక పారదర్శకంగా జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశాల్లో కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసా ద్‌, జిల్లా పరిశీలకురాలు రవళి, నాయకులు పుచ్చకాయల వీరభద్రం, నూతి వీరభద్రం, అంబటి వెంకటేశ్వర్లు, కొప్పుల గోవిందరావు, తోటకూరి ప్రగతి, కొమ్మినేని రమేష్‌, పసుపులేటి దేవేంద్రం, మడుపల్లి భాస్కర్‌, కన్నెబోయిన గోపి,బందెల నాగార్జున పాల్గొన్నారు.

ఉద్యాన అధికారి వేణుకు ‘రైతునేస్తం’ అవార్డు

ఖమ్మంవ్యవసాయం: ఉద్యాన పంటల సాగు లో రైతులకు విస్తృతంగా అవగాహ న కల్పించినందుకు వైరా ఉద్యాన అధికారి డాక్టర్‌ ఆకుల వేణు రైతునేస్తం పురస్కారా నికి ఎంపికయ్యారు. తెలుగు రాష్ట్రాల స్థాయిలో వ్యవసాయ, అనుబంధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన శాస్త్రవేత్తలు, అభ్యుదయ రైతులు, అధికా రులను పద్మశ్రీ డాక్టర్‌ ఐవీ.సుబ్బారావు పేరిట ఇచ్చే అవార్డులకు ఎంపిక చేశారు. జిల్లా నుంచి వైరా డివిజన్‌ ఉద్యాన అధికారి వేణుకు స్థానం దక్కగా ఈనెల 26న హైదరాబాద్‌లో అవార్డు స్వీకరిస్తారు. డాక్టర్‌ వేణు ఉద్యాన విద్యలో మాస్టర్స్‌ డిగ్రీతో పాటు పీహెచ్‌డీ చేయగా.. పంటల సాగులో ఆధునిక విధానాలపై రైతులకు అవగాహన కల్పించడమే కాక మియాజాకీ, అవకాడో, మెకాడ్మియా తదితర పంటలను పరిచ యం చేశారు. కాగా, వేణుతో పాటు గతంలో ఖమ్మం, భద్రాది కొత్తగూడెం జిల్లాల ఉద్యాన అధికారి పనిచేసి ప్రస్తుతం మహబూబాబాద్‌ జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్న జినుగు మరియన్న అవార్డుకు ఎంపికయ్యారు.

‘ఏరుగట్ల’ లబ్ధిదారులకు న్యాయం చేయండి

ఖమ్మం మామిళ్లగూడెం/పెనుబల్లి: పెనుబల్లి మండలం ఏరుగట్లలోని డబుల్‌ బెడ్‌రూమ్‌ లబ్దిదారులకు న్యాయం చేయాలని బీజేపీ నాయకులు కోరారు. ఈ సందర్భంగా ఖమ్మంలో శుక్రవారం కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి, అదనపు కలెక్టర్‌ పి.శ్రీనివాసరెడ్డికి శుక్రవారం వినతి పత్రాలు అందజేశారు. అనంతరం బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరు కోటేశ్వరరావు మాట్లాడుతూ ఏరుగట్ల లో డబుల్‌బెడ్‌ రూం ఇళ్లు, ఇందిరమ్మ ఇళ్ల కేటా యింపులో అక్రమాలపై విచారణ చేపట్టి అర్హులకు న్యాయం చేయాలన్నారు. తొలుత స్థలం ఇచ్చిన 15మంది అర్హులకే ఇళ్లు కేటాయించాలని కోరారు. అంతేకాక గ్రామస్తులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గుత్తా వెంకటేశ్వరరావు, నాయకులు నంబూరి రామలింగేశ్వరరావు, ఈ.వీ.రమేష్‌, విజయరాజ్‌, భాస్కర్ణి వీరంరాజు, బొర్ర నరసింహారావు, సుదర్శన్‌ మిశ్రా, మట్టా ప్రసాద్‌, పడిగల మధుసూదన్‌, పర్సా రాంబాబు, సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు.

నిమ్మతోటల్లో  సస్యరక్షణ చర్యలు
1
1/3

నిమ్మతోటల్లో సస్యరక్షణ చర్యలు

నిమ్మతోటల్లో  సస్యరక్షణ చర్యలు
2
2/3

నిమ్మతోటల్లో సస్యరక్షణ చర్యలు

నిమ్మతోటల్లో  సస్యరక్షణ చర్యలు
3
3/3

నిమ్మతోటల్లో సస్యరక్షణ చర్యలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement