
నేటి బంద్‌కు సిద్ధం
● బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కోసం పిలుపు ● మద్దతు తెలిపిన పార్టీలు, కార్మిక, విద్యార్థి సంఘాలు
ఖమ్మంమయూరిసెంటర్: బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్‌తో బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యాన శనివారం రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చాయి. ఇందులో భాగంగా జిల్లాలో బంద్‌ను విజయవంతం చేసేందుకు బీసీ సంఘాల నాయకులు విస్తృత ప్రచారం చేశాయి. అలాగే, శుక్రవారం కాంగ్రెస్ కార్యాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసి మద్దతు ఇవ్వాలని కోరారు. గత మూడు రోజులుగా జిల్లాలో నాయకులు విస్తృత ప్రచారం చేయడంతో పాటు పలు పార్టీల మద్దతు కూడగట్టారు. ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్‌ఎస్, సీపీఎం, సీపీఐ, మాస్‌లైన్, ఆమ్ ఆద్మీ పార్టీ, తెలంగాణ జన సమితితో పాటు అనుంబంధ సంఘాలు, యు వజన సంఘాల నాయకులు బంద్‌కు మద్దతు ప్రకటించారు. అంతేకాక విద్యాసంస్థల బాధ్యులు, వ్యా పార సంస్థల ప్రతినిధులను కోరడంతో వారు కూడా సానుకూలంగా స్పందించారు. బంద్ ద్వారా రిజర్వేషన్ల ఆవశ్యకతను చాటిచెప్పడమే కాక అందరి మద్దతుతో సాధించుకోవడమే తమ లక్ష్యమని బీసీ సంఘాల నాయకులు చెబుతున్నారు.
జేఏసీ సమావేశం
రిజర్వేషన్ల సాధనకు శుక్రవారం చేపడుతున్న బంద్‌ను జయప్రదం చేసేందుకు బీసీ సంఘాల జేఏసీ నేతలు శుక్రవారం ఖమ్మంలో సమావేశమయ్యారు. ఈసమావేశంలో గుండాల కృష్ణ, బొమ్మ రాజేశ్వరరావు, కూరాకుల నాగభూషణం, కూరపాటి వెంకటేశ్వర్లు, తాటి వెంకటేశ్వర్లు, మేకల శ్రీనివాసరావు, యర్రా శ్రీనివాసరావు, ఆవుల అశోక్ తదితరులు పాల్గొన్నారు. బంద్ విజయవంతం కోసం చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించారు. ఖమ్మం జిల్లాలో ప్రశాంత వాతావరణంలో బంద్ జరిగేలా అన్ని పార్టీలు, సంఘాల నేతలను సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. అంతేకాక జిల్లా కేంద్రంలోని పలు ప్రాంతాల్లో విజయవంతానికి ప్రచారం నిర్వహించారు.
ఉపాధ్యాయ సంఘాల మద్దతు
ఖమ్మం సహకారనగర్: బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యాన బంద్‌కు ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల నాయకులు మద్దతు ప్రకటించారు. ఈమేరకు ఎస్‌టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు దేవరకొండ సైదులు, యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పారుపల్లి నాగేశ్వరరావు, టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు నాగేశ్వరరావు, పీఆర్‌టీయూ నాయకుడు సతీష్ శుక్రవారం ఎస్‌టీఎఫ్ కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయడమనే నిర్ణయం సమానత్వానికి దారి తీసే చారిత్రక నిర్ణయమన్నారు. ఈమేరకు రాష్ట్రం నుంచి పంపిన బిల్లును కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలని డిమాండ్ చేశారు. నాయకులు బుర్రి వెంకన్న, ఉద్దండ్, సతీష్, యాదగిరి, మన్సూర్, కత్తి. నెహ్రూ శ్రీనివాస్, నాగేశ్వరరావు, వెంకన్న, మాదాల. నాగేశ్వరరావు, స్వర్ణకుమార్, సంగమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.