
ప్రజాస్వామ్యానికే ముప్పు..
వైరా: ప్రజాస్వామ్యంలో ప్రజల గొంతుకగా నిలిచే పత్రికలపై ప్రభుత్వాలు కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే ప్రజాస్వామ మనుగడకే ముప్పు ఎదురవుతుందని జర్నలిస్టు సంఘాలు, పార్టీల నాయకులు పేర్కొన్నారు. ‘సాక్షి’ ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి, పత్రికను ఏపీ ప్రభుత్వం కేసులు పేరుతో వేధింపులకు గురి చేయడాన్ని నిరసిస్తూ అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ‘సాక్షి’ కార్యాలయానికి నోటీసులు ఇచ్చే పేరుతో పోలీసులు తరచూ రావడం, ఎడిటర్‌పై కేసులు నమోదు చేసి జర్నలిస్టులను భయబ్రాంతులకు గురి చేయడం సరికాదన్నారు. అనంతరం ర్యాలీగా వెళ్లి తహసీల్‌లో డిప్యూటీ తహసీల్దార్ సురేష్‌కు వినతిపత్రం అందజేశారు. ఈకార్యక్రమంలో పార్టీలు, సంఘాల నాయకులు, జర్నలిస్టులు శీలం వెంకటనర్సిరెడ్డి, దాసరి దానియేలు, దార్నా రాజశేఖర్, మల్లు రామకృష్ణ, ముళ్లపాటి సీతారాములు, భూక్యా వీరభద్రం, బొంతు రాంబాబు, సుంకర సుధాకర్, యమాల గోపాలరావు, గుజ్జర్లపూడి దేవరాజు, కంకణాల శిరీష, జర్నలిస్టులు పారుపల్లి కృష్ణారావు, సూతకాని ప్రేమ్‌చంద్, షేక్ మహ్మద్ రిజ్వాన్, చంద్రశేఖర్, ఏపూరి రాజారావు, గొల్లమందల విజయ్, పులి కృష్ణార్జున్‌రావు, గద్వాల రవీందర్, షేక్ రఫీ, సూతకాని శ్రీకాంత్, నందిగామ మనోహర్, ప్రశాంత్, భూక్యా శ్రీను, చారి, ఆది శ్రీకాంత్, ఎక్కిరాల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.