
చికిత్స పొందుతున్న యువకుడు మృతి
ఎర్రుపాలెం: ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ ము లుగుమాడుకు చెందిన ఇద్దరు స్నేహితులు గురువారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతిచెందాడు. గ్రామానికి చెందిన ఆముదాల రాము(24) శుక్రవారం ఉదయం ఖమ్మం ప్రభు త్వ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ కన్నుమూశాడు. ఆయన సోదరుడు రాంబాబు ఫిర్యాదుతో కేసు నమో దు చేసినట్లు ఎస్‌ఐ రమేష్ తెలిపారు.
కాల్వలో గల్లంతైన బాలుడు..
పెనుబల్లి: చేపల వేట కోసం వెళ్లి సాగర్ కాల్వలో గల్లంతైన రేపల్లే మనోజ్(14) మృతి చెందాడు. పెనుబల్లి మండలం వీ.ఎం.బంజరు జంగాల కాలనీకి చెందిన రేపల్లే మనోజ్, పర్వతం శివ తుమ్మలపల్లి వద్ద సాగర్ కెనాల్‌లో గాలాలతో చేపలు పట్టడానికి గురువారం వెళ్లారు. ఈక్రమాన మనోజ్ ప్రమాదవశాత్తు కాల్వలో పడిపోగా, ఆయన రక్షించే క్రమంలో శివ కూడా నీట మునిగాడు. సమీపాన ఉన్న మేకల కాపరి శివను రక్షించినా మనోజ్ మాత్రం గల్లంతయ్యాడు. దీంతో ఎస్సై కె.వెంకటేష్ ఆధ్వర్యాన గాలింపు చేపట్టగా శుక్రవారం మధ్యాహ్నం మనోజ్ మృతదేహం బయటపడింది.
రోడ్డుప్రమాదంలో వ్యక్తి..
ఖమ్మంక్రైం: ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న ఓ వ్యక్తి మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఖమ్మం వన్ టౌన్‌సీఐ కరుణాకర్ వెల్లడించిన వివరాలు... ఖమ్మం ముస్తఫానగర్‌లో నివసించే యలగందుల వెంకటేశ్వర్లు(58) వడ్రంగిగా పనిచేస్తున్నాడు. ఆయన శుక్రవారం తన ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ఎదురుగా కుటుంబంతో వచ్చిన సీసీఆర్‌బీ కానిస్టేబుల్ కొండపల్లి మురళిబాబు వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో వెంకటేశ్వర్లు ట్రాఫిక్ పోస్ట్‌కు ఢీకొని తీవ్ర గాయాలపాలయ్యాడు. దీంతో ఆయనను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇదే ఘటనలో కానిస్టేబుల్ మురళి, ఆయన కుమార్తె ఆశ్రిత తీవ్రంగా గాయపడగా వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

చికిత్స పొందుతున్న యువకుడు మృతి