
పారదర్శకంగా జిల్లా అధ్యక్ష ఎన్నిక
వైరా/ఏన్కూరు: కాంగ్రెస్ పార్టీలో అనుభవంతో పాటు పార్టీ అభివృద్ధికి పాటు పడే నాయకులనే అధ్యక్ష పదవికి ఎంపిక చేస్తామని, ఇదంతా పారదర్శకంగా సాగుతుందని ఏఐసీసీ పరిశీలకుడు కె.మహేంద్రన్ స్పష్టం చేశారు. వైరా, ఏన్కూరులో గురువారం జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక కోసం నిర్వహించిన ఏ, బీ బ్లాక్ కార్యకర్తల సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిప్రాయాలు సేకరించాక మహేంద్రన్ మాట్లాడారు. కార్యకర్తల అభిప్రాయ సేకరణ తర్వాతే అధ్యక్షులను ఎన్నుకోవాలన్న ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ సూచనతో సమావేశాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈమేరకు పార్టీలో క్రమశిక్షణ, అంకితభావంతో పనిచేసిన వారికే పదవులు దక్కుతాయని చెప్పారు. కాగా, స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరిగినా కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పని చేయాలని మహేంద్రన్ సూచించారు. అనంతరం వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ మాట్లాడగా డీసీసీ ఎన్నికల ఇన్‌చార్జి రవళిరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, నాయకులు నూతి సత్యనారాయణ, బొర్రా రాజశేఖర్, సూతకాని జైపాల్, బానోత్ బాలాజీ, అనుమోలు కృష్జార్జునరావు, కట్ల రంగారావు, ఏదునూరి సీతారాములు, శీలం వెంకటనర్సిరెడ్డి, వడ్డె నారాయణరావు, సూరంపల్లి రామారావు, దార్న రాజశేఖర్, మిట్టపల్లి నాగి, కోసూరి శ్రీను, స్వర్ణ నరేంద్ర, మంగీలాల్, చంద్రప్రకాశ్, గుగులోత్ లచ్చిరామ్, శెట్టిపల్లి వెంకటేశ్వరరావు, వేముల కృష్ణప్రసాద్, లేళ్ల వెంకటరెడ్డి, గుత్తా వెంకటేశ్వరరావు, కొప్పుల ప్రభావతి, లాలూనాయక్, గాలీబ్, హరిలాల్, నాగేశ్వరరావు, శేఖర్, నరేష్ తదితరులు పాల్గొన్నారు
ఏఐసీసీ పరిశీలకుడు మహేంద్రన్