
డ్రైవర్లు, కండక్టర్ల కృషితోనే ఆర్టీసీ ఉన్నతి
ఖమ్మంమయూరిసెంటర్: ఆర్టీసీ అభివృద్ధికి డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్‌లు మూలస్తంభాలుగా నిలుస్తున్నారని.. సంస్థ ఉన్నతిలో వారి పాత్ర కీలకమని కరీంనగర్ జోన్ ఈడీ పి.సోలమన్ అన్నారు. రీజియన్ స్థాయి ప్రగతిచక్ర అవార్డులకు ఎంపికై న సిబ్బందికి ఖమ్మంలో గురువారం అవార్డులు అందజేశాక ఈడీ మాట్లాడారు. ఉద్యోగులు చిత్తశుద్ధితో విధులు నిర్వర్తిస్తే ప్రయాణికుల మన్ననలు పొందడంతో పాటు సంస్థ అభివృద్ధి బాట పడుతుందని తెలిపారు. ఆర్‌ఎం ఏ.సరిరామ్ మాట్లాడుతూ వివిధ కేటగిరీల డ్రైవర్లు 18మంది, కండక్టర్లు ఏడుగురు, మెకానిక్‌లు ముగ్గురు ఉత్తమ ఉద్యోగులుగా ఎంపికయ్యారని చెప్పారు. అలాగే, రీజియన్‌లో ఉత్తమ బస్టాండ్‌గా వైరా బస్టాండ్ ఎంపికైందని ఆర్‌ఎం తెలిపారు.
డ్రా విజేతలకు బహుమతులు
దసరా సెలవుల్లో బస్సుల్లో ప్రయాణించిన వారి నుంచి ముగ్గురికి డ్రా ద్వారా ఎంపిక చేయగా విజేతలకు ఈడీ సోలమన్ బహుమతులు అందజేశారు. వరుసగా మూడు బహుమతులు సాధించిన ఎల్.కాంతారావు, సాయిబాబా, సునీల్‌కుమార్‌కు రూ.25 వేలు, రూ.15 వేలు, రూ.10 వేల చెక్కులు అందజేశారు. డిప్యూటీ రీజినల్ మేనేజర్ మల్లయ్య, పర్సనల్ ఆఫీసర్ సంపత్‌తో పాటు డిపో మేనేజర్లు సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.
కరీంనగర్ జోన్ ఈడీ పి.సోలమన్