
రాష్ట్ర బంద్‌కు అఖిలపక్షం మద్దతు
సత్తుపల్లి/సత్తుపల్లిటౌన్: బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేయాలనే డిమాండ్‌తో ఈనెల 18న చేపడుతున్న రాష్ట్ర వ్యాప్త బంద్‌కు అఖిపక్షం మద్ధతు ఇచ్చిందని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నారాయణవరపు శ్రీనివాస్ తెలిపారు. ఈమేరకు అన్నివర్గాల ప్రజలు సహకరించి బంద్‌ను విజయవంతం చేయాలని కోరారు. సత్తుపల్లిలో గురువా రం ఆయన మాట్లాడారు. అన్ని వర్తక, వాణిజ్య, వ్యాపార సంస్థలు, విద్యాసంస్థలు బంద్‌కు సహకరించాలన్నారు. నాయకులు దండు ఆదినారాయణ, పాండు, రఫీ, గాదె చెన్నారావు, శరత్, రంగారావు, మరికంటి శ్రీనివాసరావు, వెంకటేశ్వర్లు, సంధీప్, చల్లారి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. కాగా, బీసీ సంక్షేమ సంఘం తలపెట్టిన బంద్‌కు బీజేపీ మద్దతు ప్రకటిస్తోందని ఆ పార్టీ ఖమ్మం పార్లమెంట్ కన్వీనర్ నంబూరి రామలింగేశ్వరరావు తెలిపారు. సత్తుపల్లిలో ఆయన మాట్లాడగా, నాయకులు రమేష్, నాయుడు రాఘవరావు, విజయ్, శివకృష్ణ, నరేష్, వీరంరాజు, సుదర్శన్ మిశ్రా, సురేందర్‌రెడ్డి, కృష్ణయ్య, శ్రీను, రాంబాబు పాల్గొన్నారు.
గంజాయి సేవిస్తున్న
ఆరుగురి అరెస్ట్
సత్తుపల్లి: గంజాయి పీలుస్తున్న ఆరుగురిని సత్తు పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. సత్తుపల్లి మండలానికి చెందిన జె.సింహాద్రి, కె.రంజిత్ తమ స్నేహితులైన ఎస్.రాజేష్, అశోక్‌తో కలిసి ఒడిశా వెళ్లి మధు అనే వ్యక్తి వద్ద నుంచి గంజాయి కొనుగోలు చేశారు. ఈ గంజాయిని సింహాద్రి వద్ద దాయగా, గురువారం పీల్చేందుకు రేజర్ల సమీపాన డంపింగ్ యార్డ్ సమీపానికి రంజిత్, పవన్ సాయి, శ్రీనాథ్, స్వామి, రక్షక్ వచ్చారు. అదేసమయాన పెట్రోలింగ్‌కు వెళ్లిన చూసిన పోలీసులను చూసి పారిపోతుండడంతో అదుపులోకి తీసుకుని తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా 320 గ్రాముల గంజాయి, నాలుగు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించినట్లు సత్తుపల్లి సీఐ శ్రీహరి తెలిపారు.
బీసీ సంక్షేమ సంఘం
జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్