
‘నాన్నే నా హీరో’ పుస్తక ఆవిష్కరణ
సత్తుపల్లిరూరల్: నిరుపేద కుటుంబం నుంచి వచ్చినా అద్భుతమైన కథలు రాసిన సత్తుపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థి ఆవుల పోతురాజు మరికొందరికి స్ఫూర్తిగా నిలుస్తాడని సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి తెలిపారు. విద్యార్థి రాసిన 20 కథలతో గార్లపాటి–బొల్లేపల్లి ట్రస్ట్ ఆధ్వర్యాన ‘నాన్నే నా హీరో’ శీర్షికన పుస్తకాన్ని ముద్రించారు. ఈ పుస్తకాన్ని రాగమయి దయానంద్ గురువారం ఆవిష్కరించి మాట్లాడారు. పిల్లల్లో ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తే పోతురాజు వంటి మరికొందరు బయటకు వస్తారని తెలిపారు. అనంతరం విద్యార్థి, ఆయన తల్లి తిరుపతమ్మ, ఉపాధ్యాయులు ఎం.రమాదేవి, వెంకటాచార్యులు, హెచ్‌ఎం సోదు షేక్, పుస్తకాన్ని ప్రచురించిన రామకృష్ణ, బి.మధుసూదన్‌రాజును సత్కరించారు. కార్యక్రమంలో రామిశెట్టి శ్రీనివాసరావు, పసుపులేటి నాగేశ్వరరావు, మహమ్మద్ షాకీర్ హుస్సేన్, గోలి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.