
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు
అడిషనల్ డీసీపీ ప్రసాద్‌రావు
ఖమ్మంక్రైం: రానున్న దీపావళి సందర్భంగా బాణసంచా షాప్‌లు ఏర్పాటుచేసే వారు నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని అడిషనల్ డీసీపీ ప్రసాద్‌రావు సూచించారు. తద్వారా ప్రమాదాలు జరగకుండా అరికట్టవచ్చని తెలిపారు. జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాలలో 86, పెవిలియన్ మైదానంలో 42 షాపులు కలిపి 128షాప్‌ల ఏర్పాటుకు నిర్ణయించగా, 148మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా బుధవారం పోలీస్ కాన్ఫరెన్స్ హాల్‌లో డ్రా తీసి షాప్‌లు కేటాయించారు. అనంతరం అడిషనల్ డీసీపీ మాట్లాడుతూ పోలీసు, అగ్నిమాపక, మున్సిపల్ శాఖల సూచనతో షాప్‌లు ఏర్పాటుచేసుకోవాలని సూచించారు. విక్రయాల సమయాన తగిన జాగ్రత్తలు పాటించాలని, అనుమతి లేకుండా బాణాసంచా నిల్వ చేసినా, తయారు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా, బాణాసంచాల షాప్‌లు ఇప్పిస్తామంటూ ఎవరైనా డబ్బు వసూలు చేస్తే తమకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈకార్యక్రమంలో నగర ఏసీపీ రమణమూర్తి, ఖమ్మం టూటౌన్ సీఐ బాలకృష్ణ పాల్గొన్నారు.