
ఆరోగ్యశ్రీ డీఈఓల సంఘం రాష్ట్ర కమిటీ ఎన్నిక
ఖమ్మంవైద్యవిభాగం: ప్రభుత్వ ఆస్పత్రుల్లోని ఆరోగ్య శ్రీ డేటా ఎంట్రీ ఆపరేటర్ల (డీఈఓలు) సంఘం రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఖమ్మంలో బుధవారం జరిగిన సమావేశంలో ఈ ఎన్నిక జరగగా, డీఈఓల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని తీర్మానించారు. అనంతరం రాష్ట్ర కార్యవర్గం వివరాలను టీఎన్జీవోస్ రాష్ట్ర నాయకుడు నందగిరి శ్రీనివాస్ ప్రకటించారు. సంఘం అధ్యక్షుడిగా కె.వినయ్‌కుమార్(ఖమ్మం), అసోసియేట్ అధ్యక్షుడిగా కె.శ్రీహరి(దుబ్బాక), కార్యదర్శిగా జి.సుధాకర్(భద్రాచలం), కోశాధికారి గా పి.సంతోష్(గజ్వేల్)ను ఎన్నుకున్నారు. అలా గే, ఉపాధ్యక్షులుగా ఎన్.ఎల్లేశ్(జనగామ), పి.సంతోష్(మెదక్), సహాయ కార్యదర్శిగా బి.సతీశ్(వరంగల్), శోభ(కరీంనగర్), ప్రచార కార్యదర్శిగా బి. గౌతమ్(కామారెడ్డి), ప్రచార కార్యదర్శిగా మౌని క (బాన్సువాడ), కార్యవర్గ సభ్యులుగా ఎస్‌కేఇమ్మాన్(కామారెడ్డి), జి.సాగర్(ఖమ్మం), సునీల్(బూర్గంపాడు)ను ఎన్నుకున్నారు.