
పిల్లల్లో పోషణ లోపం
చిన్నారులపై ప్రత్యేక దృష్టి
● బరువు తక్కువగా మరికొందరు.. ● ‘పోషణ మాసం’ సర్వేలో గుర్తింపు ● మాతాశిశు సంరక్షణే లక్ష్యంగా అవగాహన సదస్సులు
సత్తుపల్లిటౌన్: పిల్లలకు అందించాల్సిన పోషకాహా రంపై తల్లిదండ్రులకు అవగాహన లేక సమస్యలు ఏర్పడుతున్నాయి. పిల్లల పోషణతో పాటు ఆరో గ్యం మెరుగుపర్చడమే లక్ష్యంగా అంగన్‌వాడీ కేంద్రాలు పని చేస్తున్నా పూర్తిస్థాయిలో ఫలితాలు రావ డంలేదు. సరైన పోషకాలు అందక పలువురు చిన్నా రుల్లో ఎదుగుదల లోపిస్తోంది. ఈ నేపథ్యాన అంగన్‌వాడీల ద్వారా చిన్నారుల్లో బలహీనత, రక్తహీనత, పోషణ లోపాలు నివారించేందుకు ప్రభుత్వం సంకల్పించింది. జిల్లాలో కల్లూరు, కామేపల్లి, ఖమ్మం రూరల్, ఖమ్మం అర్బన్, మధిర, సత్తుపల్లి, తిరుమలాయపాలెంలలో ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉన్నాయి. వీటి పరిధిలో తల్లిదండ్రులతో పాటు ఇతర లబ్ధిదారులకు అవగాహన కల్పించేలా ‘పోషణ మాసం’ నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు అతి తీవ్రలోపపోషణ, తీవ్ర లోపపోషణతో 1,940 మంది చిన్నారులు, అతితక్కువ బరువు, తక్కువ బరువుతో 4,171 మంది పిల్లలు ఉన్నట్లు గుర్తించారు.
ప్రత్యేక ప్రణాళికతో..
బాల్యం బాగుంటే భవిష్యత్ బంగారుమయమవుతుందనే నినాదంతో ప్రభుత్వం మాతాశిశు సంరక్షణకు ప్రాధాన్యత ఇస్తోంది. ఇందులో భాగంగా ఏటా గర్భిణులు, బాలింతలు చిన్నారుల ఆరోగ్య రక్షణ కోసం ఐసీడీఎస్ ఆధ్వర్యాన సెప్టెంబర్ 17వ తేదీనుంచి అక్టోబర్ 16వ తేదీవరకు పోషణ మాసం కార్యక్రమాలు నిర్వహిస్తారు. గర్భం దాల్చి నప్పటి నుంచి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పోషకా హారం ఆవశ్యకతతో పాటు బాలింతలు, చిన్నారులకు అందించాల్సిన పౌష్టికాహారంపై అవగాహన కల్పించేలా ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతారు. ఈ సమయాన చిన్నారుల ఆరోగ్యాన్ని పరీక్షించి లోపాలను గుర్తించడంతో పాటు అందించాల్సిన ఆహా రంపై అవగాహన కల్పిస్తున్నారు.
లోపాలను అధిగమించేలా..
ఆరోగ్యకర జీవనశైలిని అలవాటు చేయడమే లక్ష్యంగా అంగన్‌వాడీ కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు స్థానికంగా లభించే కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల ద్వారా పోషకాలపై అవగాహన కల్పిస్తున్నారు. అంతేకాక చిన్నారులకు అన్నప్రాసన, గర్భిణులకు సీమంతం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే అంగన్‌వాడీ కేంద్రాల్లో కిచెన్‌గార్డెన్ల పెంపకం చేపట్టి అందులో పండించే కూరగాయల ద్వారా భోజనం సమకూరుస్తారు. అలాగే, చిన్నారుల ఎత్తు, బరువు పరీక్షించి పరిస్థితులు మెరుగపడేలా బాలామృతం, క్యాల్షియం, ఐరన్ మాత్రలు పంపిణీ చేపడుతున్నారు. అంతేకాక పోషకాహారం, తల్లిపాల ఆవశ్యకతపై ర్యాలీలు, సదస్సులతో అవగాహన పెంపొందిస్తున్నారు.
ప్రభుత్వం చిన్నారుల ఆరోగ్యాన్ని మెరుగపరిచేలా ప్రత్యేక దృష్టి సారించింది. ఈక్రమంలోనే పోషణమాసంలో వయస్సుకు తగిన బరువు లేని చిన్నారుల ఎదుగుదలకు తీసుకోవాల్సిన చర్యలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నాం. ఆహారంలో పాలు, పండ్లు, కూరగాయలు, చిరు ధాన్యాలను చేర్చడం వల్ల ప్రయోజనాలను వివరిస్తున్నాం.
– రాంగోపాల్‌రెడ్డి,
జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమ శాఖాధికారి

పిల్లల్లో పోషణ లోపం

పిల్లల్లో పోషణ లోపం