పెద్దాస్పత్రిలో టాస్క్‌ఫోర్స్‌ సభ్యుల తనిఖీ | - | Sakshi
Sakshi News home page

పెద్దాస్పత్రిలో టాస్క్‌ఫోర్స్‌ సభ్యుల తనిఖీ

Oct 16 2025 5:57 AM | Updated on Oct 16 2025 5:57 AM

పెద్ద

పెద్దాస్పత్రిలో టాస్క్‌ఫోర్స్‌ సభ్యుల తనిఖీ

ఖమ్మంవైద్యవిభాగం: టాస్క్‌ఫోర్స్‌ రాష్ట్ర కమి టీ సభ్యురాలు, వైద్య ఆరోగ్యశాఖ రాష్ట్ర అడిషనల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ శశిశ్రీ బుధవారం ఖమ్మం జనరల్‌ ఆస్పత్రిని తనిఖీచేశారు. వివిధ వార్డు లు, ఆపరేషన్‌ థియేటర్‌, డ్రగ్‌ స్టోర్‌ను పరిశీలించిన ఆమె అగ్నిమాపక నియంత్రణ పరికరాల నిర్వహణపై ఆరా తీశారు. అలాగే, మందుల లభ్యత, ఈ – ఔషధి పోర్టల్‌ను వివరాల నమోదుపై సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఎం.నరేందర్‌తో సమీక్షించారు. రూ.5 లక్షలకు పైగా విలువైన పరికరాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. హెచ్‌ఈఈఓ వి.రవికుమార్‌, ఎం.దుర్గ, బయో మెడికల్‌ ఇంజనీర్‌ ఇస్లావత్‌ రెడ్డి, ఫార్మసీ సూపర్‌వైజర్‌ వై.పద్మావతి పాల్గొన్నారు. ఆ తర్వాత పాండురంగాపురం బస్తీ దవాఖానాను సైతం శశిశ్రీ తనిఖీ చేశారు.

వ్యాక్సిన్లతో వ్యాధుల వ్యాప్తికి చెక్‌

మధిర: బాలింతలు, గర్భిణులతో పాటు చిన్నారులకు క్రమం తప్పకుండా టీకాలు వేయించ డం ద్వారా వ్యాధులు దరిచేరవని జిల్లా వాక్సిన్‌ లాజిస్టిక్‌ మేనేజర్‌ చింతల వెంకటరమణ తెలిపారు. మధిర మండలంలోని దెందుకూరు, మడుపల్లి, మధిర పీపీ యూనిట్లలో బుధ వారం వ్యాక్సినేషన్‌ శిబిరాలను ఆయన పరిశీలించి మాట్లాడారు. టీకా ల నిల్వపై సిబ్బందిని ఆరా తీయడమేకాక డోస్‌ల వారీగా క్రమం తప్పకుండా టీకాలు వేయాలని సూచించారు. అలాగే, ఆస్పత్రులకు వచ్చిన బాలింతలు, గర్భిణులకు టీకాల ప్రాముఖ్యతను వివరించారు. డాక్టర్‌ పృథ్వీరాజ్‌నాయక్‌, సీహెచ్‌ఓ వి. వెంకటేశ్వర్లు, ఉద్యోగులు గోవింద్‌, లంకా కొండయ్య తదితరులు పాల్గొన్నారు.

ఉచిత గుండె జబ్బుల

నిర్ధారణ శిబిరం

ఖమ్మంవైద్యవిభాగం: ఇండియన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ పీడియాట్రిక్స్‌ (ఐఏపీ) జిల్లా కమిటీ ఆధ్వర్యాన హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రి సౌజన్యంతో బుధవారం చిన్నపిల్లల గుండె జబ్బుల నిర్ధారణ శిబిరం నిర్వహించారు. ఐఏపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ ప్రదీప్‌కుమార్‌ ఆధ్వర్యాన ఐఎంఏ హాల్‌లో నిర్వహించిన శిబిరంలో పెద్దసంఖ్యలో తల్లిదండ్రులు పిల్లలతో హాజరయ్యారు. ఈ సందర్భంగా వైద్యు లు భరత్‌కుమార్‌, సాయిభార్గవ్‌తో పాటు ఏఐజీ ఆస్పత్రి గుండె జబ్బుల వైద్యనిపుణులు చిన్న స్వామిరెడ్డి, లింగస్వామి చిన్నారులకు పరీక్షలు నిర్వహించారు. అనంతరం ప్రదీప్‌ కుమార్‌ మాట్లాడుతూ.. పిల్లల్లో గుండెజబ్బులకు కారణాలపై అవగాహన కల్పించడంతో పాటు చికిత్సకు ఉన్న అవకాశాలను వివరించామని తెలిపారు.

అత్యవసర సేవల

వాహనాల తనిఖీ

మధిర: మండలంలో 108, 1962, 102 వాహనాలను జిల్లా అత్యవసర సేవల అధికారి ఆవులూరి దుర్గాప్రసాద్‌ బుధవారం తనిఖీ చేశారు. వాహనాల పనితీరు, రోజువారి కేసులను రికార్డుల ఆధారంగా పరిశీలించారు. అత్యవసర సమయాల్లో కీలకమైన ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉద్యోగులు పేరెల్లి రవీంద్రబాబు, గుజ్జర్లపూడి రామయ్య, తాజుద్దీన్‌, వెంకటేశ్వర్లు, తోటపల్లి రాజేశ్‌, పశు వైద్యాధికారులు సౌజన్య, నందిని పాల్గొన్నారు.

పెద్దాస్పత్రిలో  టాస్క్‌ఫోర్స్‌ సభ్యుల తనిఖీ 1
1/2

పెద్దాస్పత్రిలో టాస్క్‌ఫోర్స్‌ సభ్యుల తనిఖీ

పెద్దాస్పత్రిలో  టాస్క్‌ఫోర్స్‌ సభ్యుల తనిఖీ 2
2/2

పెద్దాస్పత్రిలో టాస్క్‌ఫోర్స్‌ సభ్యుల తనిఖీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement