
బాల రచయితగా పోతురాజు
సత్తుపల్లిరూరల్: ప్రతిభ ఎవరి సొంతమూ కాదు.. పట్టుదల, కృషిచేసి ఉంటే ఏ స్థాయికై నా ఎద గొచ్చని నిరూపించాడు సత్తుపల్లి మండలం గంగా రం గ్రామానికి చెందిన 14 ఏళ్ల విద్యార్థి ఆవుల పోతురాజు. ఇప్పటివరకు విద్యార్థి 20 కథలు రాయగా, వీటిని గార్లపాటి – బొల్లేపల్లి ట్రస్ట్ నిర్వాహకులు జి.రామకృష్ణ, బి.మధుసూదన్‌రాజు ఆధ్వర్యాన పుస్తకంగా తీసుకొస్తున్నారు. ఈ మేరకు బుధవారం వారు వివరాలను వెల్లడించారు. పెను బల్లి మండలం టేకులపల్లికి చెందిన ఆవుల యాక య్య – తిరుపతమ్మకు మారేషు, అంకిత, పోతు రాజు ముగ్గురు సంతానం. గంగిరెడ్ల సామాజిక వర్గానికి చెందిన యాకయ్య కుటుంబం పదేళ్ల క్రితం సత్తుపల్లికి చేరుకొని గుడిపాడురోడ్డు చివర గుడా రం వేసుకొని గంగిరెద్దులను ఆడిస్తూ జీవనం సాగిస్తోంది. సత్తుపల్లి ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న పోతురాజు 9వ తరగతిలో ఉన్నప్పుడే వేమన శతకంలోని వంద పద్యాలు నేర్చుకుని అవధానం చేశాడు. అయితే, పోతురాజుకు కథలు రాసే నైపుణ్యం ఉందని గ్రహించిన తెలుగు ఉపాధ్యాయురాలు ఎం.రమా దేవి ప్రోత్సహించగా ఇరవై కథలు రాశాడు. దీనికి హెచ్‌ఎం సోందు షేక్ పోతురాజుకు సహకరించారు. ఆపై విషయం గార్లపాటి, బొల్లేపల్లి ట్రస్ట్ బాధ్యులకు చేరడంతో పుస్తకాన్ని ప్రచురించడానికి సిద్ధమయ్యారు. దాతల చేయూతతో పుస్తక ప్రచురణ చివరి దశకు చేరిందని రామకృష్ణ, మధుసూదన్‌రాజు తెలిపారు.
సంచార కుటుంబం నుంచి
సాహితీ లోకంలోకి..