
అంగన్‌వాడీల్లో పోషకాహారం
చింతకాని: అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అందిస్తున్న పోషకాహారా న్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా సంక్షేమా ధికారి కె.రాంగోపాల్‌రెడ్డి సూచించారు. పోషణ మా సోత్సవంలో భాగంగా చింతకాని రైతువేదికలో బుధవారం గర్భిణులకు సీమంతాలు, పిల్లలకు అక్షరాభ్యాసం, అన్నప్రాసన చేయించారు. ఈ సందర్భంగా డీడ బ్ల్యూఓ మాట్లాడుతూ.. పోషకాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం సొంతమవుతుందని తెలిపారు. అంతేకాక పిల్లల్లో మానసిక, శారీరక అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. పోషకాహర లోపంతో చాలామంది పిల్ల లు రక్తహీనతతో బాధపడుతున్నందున బాలింతలు అవగాహన పెంచుకోవాలని సూచించారు. అనం తరం తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు కలిగిన ఆహారం తయారీపై ప్రదర్శన నిర్వహించారు. ఐసీడీఎస్ సీడీపీ ఓ కమలప్రియ, ఎంపీడీఓ చుంచు శ్రీనివాసరావు, తహసీల్దార్ బాబ్జీప్రసాద్, మండల వైద్యాధికారి ఆల్తాఫ్, వెంకటేశ్వర్లు, ఉద్యోగులు షామిలి, పద్మావతి, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
జిల్లా సంక్షేమాధికారి రాంగోపాల్‌రెడ్డి