
18న బంద్‌ను విజయవంతం చేయండి
ఖమ్మంమామిళ్లగూడెం: బీసీలకు 42శాతం రిజర్వేషన్ల సాధన కోసం ఈ నెల 18న చేపడు తున్న రాష్ట్రవ్యాప్త బంద్‌ను జిల్లాలో విజయవంతం చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘంజిల్లా అధ్యక్షుడు ఎన్.శ్రీనివాస్ పిలుపునిచ్చా రు. ఖమ్మం అంబేడ్కర్ భవనంలో బుధవారం జరిగిన కుల సంఘాల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతున్న నేపథ్యాన కుల సంఘాలు ఏకం కావాల్సిన అవసరం ఏర్పడిందని తెలిపారు. ఈ మేరకు 14మంది కన్వీనర్లను నియమించా రు. నాయకులు, పుల్లారావు, శివ, వెంకట్రామ య్య, వీరన్న, సుంకర శ్రీనివాస్, రామ్మూర్తి గౌడ్, కృష్ణమాచారి, మధుగౌడ్, పిండిప్రోలు రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.
బంద్‌కు మాస్‌లైన్ మద్దతు
ఖమ్మంమయూరిసెంటర్: రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేలా బిల్లును ఆమోదించకపోవడం, ఇతర అంశాలను నిరసిస్తూ బీసీ సంఘాలు ఈ నెల 18న ఇచ్చిన రాష్ట్ర బంద్‌కు మద్దతు ఇస్తున్నట్లు సీపీఐ (ఎంఎల్) మాస్‌లైన్ రాష్ట్ర కార్య దర్శి పోటు రంగారావు తెలిపారు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ల వర్గీకరణ జరగాలని పేర్కొన్నారు. ఈ క్రమాన బీసీల పోరాటానికి అండగా నిలిచేలా బంద్‌కు మద్దతు ప్రకటించినట్లు రంగారావు ఒక ప్రకటనలో తెలిపారు.
వైరా: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్‌తో ఈనెల 18న చేపట్టిన రాష్ట్ర బంద్‌కు బీసీ సంక్షేమ సంఘం సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోందని జిల్లా అధ్యక్షుడు బి.కృష్ణయ్య, నాయకులు అమ్మిక రామారావు తెలిపారు. వైరాలో జరిగిన సంఘం నియోజకవర్గ స్థాయి సమావేశంలో వారు మా ట్లాడారు. నాయకులు ఓర్సు శ్రీనివాసరావు, దరిపల్లి శ్రీనివాస్, మాచర్ల యుగంధర్, దేవరకొండ కృష్ణ పాల్గొన్నారు.