
టన్ను చెరుకు ధర రూ.3,578
నేలకొండపల్లి: మండలంలోని రాజేశ్వరపురం మధుకాన్ షుగర్ ఫ్యాక్టరీ పరిధిలో టన్ను చెరుకు ధర రూ.3,578.35గా నిర్ణయించామని ఫ్యాక్టరీ మేనేజింగ్ డైరెక్టర్ నామా కృష్ణయ్య తెలిపారు. ఫ్యాక్టరీలో మంగళవారం ఆయన మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే రూ.210 అదనంగా ఇవ్వనున్నట్లు చెప్పారు. అంతేకాక రైతులకు మూడు టన్నుల విత్తనం, పిలకతోటలో ఖాళీలు పూరించడానికి 500 మొక్కలు ఉచితంగా అందిస్తామని తెలిపారు. అధిక దిగుబడి సాధించిన రైతులకు వరుసగా రూ.లక్ష, రూ.50వేలు, రూ.25వేల నగదు బహుమతి ఇవ్వనున్నట్లు వెల్లడించారు. కాగా, ఇతర రాష్ట్రాల మాదిరి ఇక్కడ కూడా టన్ను చెరుకుకు రూ.500 బోనస్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు. ఈ ఏడాది 85వేల మెట్రిక్ టన్నుల చెరుకు గానుగ ఆడించడం లక్ష్యం కాగా, డిసెంబర్ మొదట్లో క్రషింగ్ ప్రారంభిస్తామని కృష్ణ య్య చెప్పారు. అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ కోట య్య, ఉద్యోగులు వెంకటేశ్వర్లు, అప్పారావు, నరేష్ తదితరులు పాల్గొన్నారు.