
పిల్లలను బయటకు పంపితే చర్యలు
‘సీతారామ’
భూసేకరణపై సమీక్ష
‘బీఏఎస్’పై సమీక్షలో డిప్యూటీ సీఎం భట్టి
ఖమ్మంమయూరిసెంటర్: బకాయిల పేరిట విద్యార్థినులను బయటకు పంపే పాఠశాలల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. బెస్ట్ అవైలబుల్ స్కీం(బీఏఎస్)పై రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌తో కలిసి హైదరాబాద్ నుంచి మంగళవారం ఆయన కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ బీఏఎస్ కింద ప్రైవేట్ పాఠశాలల్లో చేరిన విద్యార్థులను బకాయిల పేరిట యాజమాన్యాలు ఇబ్బంది పెట్టకుండా పర్యవేక్షించాలని తెలిపారు. ఫీజును ప్రభుత్వమే చెల్లిస్తుందని, ఈ విషయంలో తల్లిదండ్రులను బలవంతం చేస్తే తీవ్రంగా పరిగణించాలని చెప్పారు. ఈ వీసీలోజిల్లా నుంచి కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ, ఉద్యోగులు ఏ.నారాయణరెడ్డి, శ్రీనివాసరావు సంబంధిత తదితరులు పాల్గొన్నారు.
అన్ని వసతులతో కార్యాలయాల
సముదాయం
ఖమ్మంరూరల్: సకల సౌకర్యాలతో ఖమ్మం రూరల్ మండల కార్యాలయాల సముదాయాన్ని నిర్మించేలా ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి తరుణీహాట్‌లో నిర్మించనున్న సముదాయంపై కలెక్టరేట్‌లో మంగళవారం ఆయన సమీక్షించారు. కార్యాలయాలన్నీ ఒకేచోట అన్ని వసతులతో ఉండేలా నమూనా సిద్ధం చేయాలని తెలిపారు. అలాగే, అంతర్గత రహదారులు, సోలార్ విద్యుత్ ప్లాంట్లు, పార్కింగ్, తాగునీటి వసతి కల్పించాల్సి ఉంటుందని చెప్పారు. ఈసమావేశంలో ఆర్‌అండ్‌బీ డీఈ భగవాన్, ఏఈ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ఖమ్మంఅర్బన్: సీతారామ ప్రాజెక్టుకు అవసరమైన అటవీ భూమి సేకరణపై కలెక్టర్ అనుదీప్ అధికారులతో సమీక్షించారు. ఉమ్మడి జిల్లాలో సుమారు 1,138 ఎకరాల అటవీ శాఖ భూమి సేకరించాల్సి ఉందని తెలిపారు. ఇప్పటికే జలవనరుల శాఖ ద్వారా వివిధ ప్రాజెక్టుల కోసం సేకరించిన భూమిలో ఖాళీ స్థలాలను అటవీశాఖకు బదలాయించి, అందుకు బదులు ఆ శాఖ భూమి తీసుకునేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, జల
వనరుల శాఖ ఎస్‌ఈ ఎం.వెంకటేశ్వర్లు, ఉద్యోగులు రమేష్‌రెడ్డి, బాబురావు, కిషోర్, నవీన్‌కుమార్ పాల్గొన్నారు.