
రెండు రోడ్లకు రూ.40కోట్లు
ఖమ్మంఅర్బన్: జిల్లాలోని ఆర్‌అండ్‌బీ పరిధి రెండు ప్రధాన రహదారుల విస్తరణ కోసం కేంద్ర రోడ్డు నిధి (సీఆర్‌ఎఫ్) నుండి రూ.40 కోట్లు మంజూరయ్యాయి. ఇందులో ఒక్కో రహదారికి రూ.20 కోట్ల చొప్పున కేటాయించారని అధికార వర్గాలు తెలిపాయి. ఈ నిధులతో రెబ్బవరం – గన్నవరం రోడ్డు, లోకారం నుండి పెనుబల్లి వరకు రహదారులను విస్తరించనుండగా త్వరలోనే టెండర్లు పిలవనున్నట్టు తెలిసింది. ఇవికాక ‘హైబ్రీడ్’ విధానంలోనూ కొన్ని రహదారుల అభివృద్ధికి నిధులు మంజూరయ్యాయి. మధిర నియోజకవర్గంలో ఆరు, ఖమ్మం, సత్తుపల్లి నియోజకవర్గాల్లో ఒక్కో రహదారి నిర్మాణానికి నిధులు మంజూరైనట్టు సమాచారం. వీటి పనులకు కూడా త్వరలోనే టెండర్ ప్రక్రియ ప్రారంభం కానుంది.
ఖమ్మం – ఇల్లెందు రోడ్డు విస్తరణ ప్రారంభం
నాలుగు నెలల విరామం తర్వాత ఖమ్మం – ఇల్లెందు ప్రధాన రహదారిపై రఘునాథపాలెం మండలంలో రోడ్డు విస్తరణ పనులు మొదలయ్యాయి. రూ.38 కోట్ల అంచనా వ్యయంతో ఏడాదిన్నర క్రితం రఘునాథపాలెం నుంచి మంచుకొండ వరకు రహదారి విస్తరణ పనులు మొదలుపెట్టారు. అయితే, రూ.6కోట్ల విలువైన పనులు చేసినా బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్ నిలిపివేశారు. అభివృద్ధి పనులు ఆగిపోవడం, అప్పటికే రోడ్డు దెబ్బతిని ఉండడంతో రాకపోకలకు ఇక్కట్లు ఎదురయ్యాయి. దీంతో ఆర్‌అండ్‌బీ అధికారులు కాంట్రాక్టర్‌పై ఒత్తిడి తీసుకురాగా, బిల్లుల సమస్య పరిష్కరిస్తానని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భరోసా ఇవ్వడంతో కాంట్రాక్టర్ సోమవారం నుంచి పనులు మొదలుపెట్టారు.
సీఆర్‌ఎఫ్ నిధులతో విస్తరణ