జాతీయ స్థాయి టోర్నీలో వైశాలికి రజతం | - | Sakshi
Sakshi News home page

జాతీయ స్థాయి టోర్నీలో వైశాలికి రజతం

Oct 14 2025 7:17 AM | Updated on Oct 14 2025 7:17 AM

జాతీయ

జాతీయ స్థాయి టోర్నీలో వైశాలికి రజతం

ఖమ్మం స్పోర్ట్స్‌: ఒడిశా రాష్ట్రం భువన్నేశ్వర్‌లో జరుగుతున్న జాతీయస్థాయి అథ్లెటిక్స్‌ పోటీల్లో ఖమ్మంకు చెందిన బి.వైశాలి హెప్టాథిలిన్‌ ఈవె ంట్‌లో రెండో స్థానంలో నిలిచి రజత పతకం సాధించింది. అండర్‌–18 బాలికల విభాగంలో పోటీకి దిగిన ఆమె ప్రతిభ చాటిది. ఈ సందర్భంగా వైశాలిని డీవైఎస్‌ఓ టి.సునీల్‌రెడ్డి, అథ్లెటిక్స్‌ కోచ్‌ ఎం.డీ.గౌస్‌, అథ్లెటిక్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వెంకటేశ్వర్లు, ఎం.డీ.షఫీక్‌ అహ్మద్‌ అభినందించారు.

అండర్‌–17 ఉమ్మడి జిల్లా వాలీబాల్‌ జట్ల ఎంపిక

ఖమ్మం స్పోర్ట్స్‌: అండర్‌–17 విభాగంలో ఉమ్మడి జిల్లా బాలబాలికల వాలీబాల్‌ జట్లను సోమవారం ఎంపిక చేశారు. జిల్లా పాఠశాలల క్రీడల సంఘం ఆధ్వర్యాన ఖమ్మం సర్దార్‌ పటేల్‌ స్టేడియంలో నిర్వహించిన ఎంపిక పోటీలకు పెద్దసంఖ్యలో క్రీడాకారులు హాజరయ్యారు. ఇందులో బాలురు అత్యధికంగా రావడంతో తొలుత 100మందిని గుర్తించి, స్క్రీనింగ్‌ అనంతరం వారిలో నుంచి జట్టును ఎంపిక చేశారు. ఉమ్మడి జిల్లా బాలుర జట్టుకు యు.ఉదయ్‌ ముఖేష్‌, బి.నందకిషోర్‌, బి.చరణ్‌, ఎం.సాయిక్షయ్‌కుమార్‌, ఎస్‌.కే.షరీఫ్‌, ఎం.ధనుంజయ్‌, కె.నవీన్‌, బి.చేతన్‌, డి.రోహన్‌, పి.సాయిరాంతో పాటు స్టాండ్‌ బైగా బి.గణేష్‌, ఎస్‌.కే.ముద్దషీర్‌ ఎంపికయ్యారు. అలాగే, బాలికల జట్టుకు జి.హాసిని, కె.అమృత, బి.నాగేశ్వరి, పి.అనూష, బి.శ్వేత, బి.గౌతమి, వి.లావణ్య, టి.ఉమారాణి, హెచ్‌.భార్గవి, స్టాండ్‌ బైగా పి.కరుణ్యా, కె.చరితరెడ్డి ఎంపిక చేశారు. ఎంపిక పోటీలను జిల్లా పాఠశాలల క్రీడల కార్యదర్శి వై.రామారావుతో పాటు పీఈటీలు చిన్ని, పవన్‌కుమార్‌, రామారావు తదితరులు పర్యవేక్షించారు.

ప్లేట్‌లెట్లు పడిపోయిన వ్యక్తికి వైద్యుడి రక్తదానం

సత్తుపల్లిరూరల్‌: చికిత్స చేయడమే కాదు అవసరమైతే చేయూతనివ్వాలనే భావనతో రక్తదానం చేసిన ప్రభుత్వ వైద్యుడు మానవత్వాన్ని చాటాడు. సత్తుపల్లి మండలం తుంబూరుకు చెందిన రాంబాబు ఇటీవల గంగారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి రాగా పరీక్షించిన డాక్టర్‌ అవినాష్‌ ఆయనకు ప్లేట్‌ లైట్స్‌ తక్కువగా ఉన్నందున ఖమ్మం ప్రధాన ఆస్పత్రికి రిఫర్‌ చేశారు. ఆతర్వాత రాంబాబు ఖమ్మంలో చికిత్స చేయించుకుంటుండగా వివరాలు ఆరా తీసేందుకు సోమవారం అవినాష్‌ అక్కడకు వెళ్లారు. అయితే, ఆయనకు రక్తం ఇచ్చేందుకు సత్తుపల్లి నుండి ఇద్దరు వెళ్లినా గ్రూప్‌ సరిపోకపోవడం, పరిస్థితి విషమిస్తుండడంతో అవి నాష్‌ స్వయంగా రక్తదానం చేయడంపై పలువురు అభినందించారు.

ఆపరేటర్‌ నియామకాలకు రేపు రాత పరీక్ష, ఇంటర్వ్యూ

ఖమ్మంవైద్యవిభాగం: జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యాన నిర్వహించే సదరం శిబిరాల్లో రెండు డేటా ఎంట్రీ ఆపరేటర్‌ పోస్టులను ఔట్‌ సోర్సింగ్‌ విధానంలో భర్తీ చేయనున్నట్లు కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి తెలిపారు. కంప్యూటర్‌ పరిజ్ఞానం, ఇంటర్నెట్‌ వాడకంపై ప్రావీణ్యత, డేటా ఎంట్రీ పనిలో అనుభవం కలిగిన అభ్యర్థులు మంగళవారం సాయంత్రం 5గంటల్లోగా ఖమ్మం ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. వీరికి బుధవారం 60 మార్కులతో రాత పరీక్ష నిర్వహించడమే కాక ఇంటర్వ్యూ అనంతరం ఎంపిక చేస్తామని తెలిపారు. పూర్తి వివరాలకు ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ కార్యాలయంలో సంప్రదించాలని కలెక్టర్‌ సూచించారు.

రామయ్యకు ముత్తంగి అలంకరణ

భద్రాచలం: భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి వారి మూలమూర్తులు సోమవారం ముత్తంగి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరా ధన పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి పూజలు చేశాక నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. కాగా, నిత్యకల్యాణంలో పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

జాతీయ స్థాయి టోర్నీలో వైశాలికి రజతం
1
1/1

జాతీయ స్థాయి టోర్నీలో వైశాలికి రజతం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement