
ప్రేమజంట పెళ్లిపై పీఎస్‌లో ఘర్షణ
తిరుమలాయపాలెం: ఓ ప్రేమజంట వివాహం చేసుకోగా, పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్న ఇరువర్గాలు ఘర్షణకు పాల్పడగా అదుపు చేసేందుకు యత్నించిన ఓ హెడ్‌కానిస్టేబుల్ తలకు తీవ్ర గాయమైంది. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని గోల్‌తండా వాసి బోడ కృష్ణ కుమార్తె బోడ కీర్తనకు మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం అందనాలపాడు కొత్తతండాకు చెందిన అంగోత్ నవీన్‌తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఈనెల 12న బయటకు వెళ్లిన కీర్తన నవీన్‌ను పెళ్లి చేసుకుంది. ఈ ఘటనపై కృష్ణ ఫిర్యాదు చేయగా పోలీసులు ప్రేమజంటను సోమవారం స్టేషన్‌కు పిలిపించారు. అక్కడకు ఇరు కుటుంబాల వారు రావడంతో కీర్తన బంధువులు నవీన్‌పై దాడికి పాల్పడ్డారు. దీంతో ఇరువర్గాలు ఘర్షణకు దిగగా అదుపు చేసేందుకు యత్నించిన హెడ్‌కానిస్టేబుల్ బాలును నెట్టేయడంతో తల గోడకు తాకి తీవ్ర గాయమైంది. ఈమేరకు ఎస్‌ఐ కూచిపూడి జగదీష్ ఇరువర్గాలను అదుపు చేసి బాలుకు స్థానికంగా చికిత్స అనంతరం ఖమ్మం తరలించారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించడమే కాక కానిస్టేబుల్‌పై దాడికి పాల్పడిన రఘునాథపాలెం మండలం వి.వెంకటాయపాలెంకి చెందిన అంగోత్ వివేక్, గుగులోత్ నవీన్, గుగులోత్ మాజీపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
అదుపు చేసేందుకు యత్నించిన
హెడ్ కానిస్టేబుల్‌కు గాయాలు