
మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం
ఖమ్మం అర్బన్: అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని, నాణ్యత పాటించాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు సూచించారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధి 42వ డివిజన్‌లో శనివారం ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. విద్యార్థులకు మెరుగైన బోధన అందించేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వం అప్పులు మిగిల్చినా విద్యార్థుల భవిష్యత్ కోసం ప్రభుత్వం నిధులు విడుదల చేస్తోందన్నారు. ఖమ్మం నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రజలు సహకరించాలని కోరారు. రోడ్ల విస్తరణతోనే ఆయా ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందుతాయని అన్నారు. కార్యక్రమంలో మేయర్ పునుకొల్లు నీరజ, డిప్యూటీ మేయర్ ఫాతిమా జొహర, కార్పొరేటర్ పాకాలపాటి విజయనిర్మల శేషగిరిరావు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.

మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం