
కుక్కలు తరమడంతో ఇంట్లోకి దుప్పి..
సత్తుపల్లి: చుక్కల దుప్పిని కుక్కలు తరమడంతో అర్బన్‌పార్క్ ఫెన్సింగ్ దూకి ఇంట్లోకి వచ్చిన ఘట న పట్టణంలోని జలగంనగర్‌లో శనివారం చోటుచేసుకుంది. అర్బన్ పార్కులోకి ప్రవేశించిన కుక్కలు వెంటాడటంతో ఫెన్సింగ్ దూకి ఇళ్లలోకి వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు.అటవీశాఖ అధికారులకు స్థానికు లు సమాచారం ఇవ్వడంతో తాళ్ల సహాయంతో దుప్పి ని బంధించి పశువుల ఆస్పత్రికి తరలించారు. గత నెలలో చుక్కల దుప్పిని గాయపరిచిన ఘటన మరువకముందే మరో ఘటన జరగటంతో అటవీశాఖ అధికారుల వైఖరిపై విమర్శలు వస్తున్నాయి. ఇటీవల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక చొరవతో రూ.50 లక్షల సింగరేణి నిధులతో చైన్‌లింక్ ఫెన్సింగ్ వేసినా దుప్పులకు రక్షణ లేకపోవడం, అర్బన్ పార్కులోకే వెళ్లికుక్కలు వెంట పడు తున్నాయా..? బయటకు వచ్చినప్పుడు దాడి చేస్తున్నాయా..? అనే విషయంపై అటవీ అధి కారు లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై అటవీశాఖ అధికారులను వివరణ కోసం ప్రయత్నించగా దాటవేశారు.