19న రాష్ట్రస్థాయి అండర్‌–14 చెస్‌ టోర్నీ | - | Sakshi
Sakshi News home page

19న రాష్ట్రస్థాయి అండర్‌–14 చెస్‌ టోర్నీ

Oct 12 2025 6:41 AM | Updated on Oct 12 2025 6:41 AM

19న ర

19న రాష్ట్రస్థాయి అండర్‌–14 చెస్‌ టోర్నీ

ఖమ్మంఅర్బన్‌: తెలంగాణ చెస్‌ అసోసియేషన్‌ సహకారంతో జిల్లా అసోసియేషన్‌ ఆధ్వర్యాన ఈ నెల 19న ఖమ్మంలో రాష్ట్రస్థాయి అండర్‌– 14 చెస్‌ టోర్నీ నిర్వహించనున్నారు. ఖమ్మం పాత బస్టాండ్‌ సమీపంలోని టీటీడీ కల్యాణ మండపంలో జరిగే టోర్నీ పోస్టర్లను శనివారం నగర ఏసీపీ రమణమూర్తి ఆవిష్కరించారు. పోటీల్లో విజేతలకు నగదు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేయనున్నట్లు నిర్వాహకులు టి.వీరన్న తెలిపారు. వివరాల కోసం 83281 02378, 94913 57631 నంబర్లలో సంప్రదించాలని కోరారు.

వర్కర్లకు

రూ.10 వేలు ఇవ్వాలి

తల్లాడ: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం వర్కర్లకు ప్రతీనెల రూ.10 వేలు గౌరవ వేతనం చెల్లించాలని వ ర్కర్ల యూనియన్‌(ఏఐటీయూసీ) రాష్ట్ర ప్రధా న కార్యదర్శి సత్తెనపల్లి విజయలక్ష్మి డిమాండ్‌ చేశారు. తల్లాడలో మహాదేవ లక్ష్మి, తాళ్లూరి లక్ష్మి అధ్యక్షతన శనివారం జరిగిన యూని యన్‌ జిల్లా మహాసభలో ఆమె మాట్లాడారు. కాంగ్రెస్‌ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్ర కారం రాష్ట్రంలోని 54వేల మంది వర్కర్లకు నెల నెలా రూ.10వేలు చెల్లించాలని డిమాండ్‌ చేశా రు. కోడిగుడ్లతో పాటు నిత్యావసర సరుకులు కూడా ప్రభుత్వమే సరఫరా చేయాలన్నారు. ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి శింగు నరసింహారావు మాట్లాడుతూ.. ప్రతీ విద్యార్థికి రూ.25 చెల్లించాలని కోరారు. కార్యక్రమంలో ఏఐటీ యూసీ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గాదల లక్ష్మీనారాయణ, తోట రామాంజనేయు లు, నాయకులు రావి శివరామకృష్ణ, మల్లేశ్‌, రాంబాబు, దండు ఆదినారాయణ, మద్దోజు శ్రావణ్‌, ఓర్సు రమేశ్‌, దయాకర్‌, రామారావు, రహీం పాల్గొన్నారు.

విద్యుదాఘాతంతో

రైతు మృతి

తిరుమలాయపాలెం: మిర్చి తోటకు నీళ్లు పెట్టేందుకు వెళ్లి ఓ రైతు విద్యుదాఘాతా నికి గురై బావిలో పడి మృతిచెందిన ఘటన మండలంలోని పడమటితండాలో శనివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన భూక్య చంద్రు (54) మిర్చి తోటకు నీళ్లు పెట్టేందుకు వెళ్లగా ప్రమాదవశాత్తు విద్యుత్‌ షాక్‌కి గురై పక్కనే ఉన్న వ్యవసాయబావిలో పడి మృతి చెందాడు. మృతుడికి భార్య అచ్చమ్మ కుమా రుడు భూక్యా నరేశ్‌, ఇద్దరు కుమార్తెలు ఉన్నా రు. పోలీసులు కేసు నమోదు చేశారు.

కూలిన విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌

మధిర: పట్టణంలోని శివాలయం రోడ్డులో పోతులూరి వీరబ్రహ్మం గుడి వద్ద ఏర్పాటు చేసిన విద్యు త్‌ ట్రాన్స్‌ఫార్మర్‌తో పాటు స్తంభం శుక్రవారం రాత్రి ఈదురుగాలులతో కురిసిన వర్షానికి కూలిపోయాయి. ఆ సమయంలో రోడ్డుపై ఎవ రూ లేకపోవటంతో పెనుప్రమాదం తప్పింది. స్థానికులు విద్యుత్‌ శాఖాధికారులకు సమాచారం ఇవ్వటంతో ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు.

పిచ్చికుక్క దాడిలో గాయాలు

కొణిజర్ల: పిచ్చికుక్క దాడి చేయడంతో ఒకే కుటుంబంలో నలుగురు వ్యక్తులు గాయపడిన ఘటన వైరామున్సిపాలిటీ పరిధి,మండలంలోని జమ్మికోయ బంజరలో శనివారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రా మానికి చెందిన బానోత్‌ కృష్ణవేణి, ఆమె కూతు రు ఉమ ఇంట్లో పనులు చేసుకుంటుండగా పిచ్చికుక్క వారి ఇంటి ఆవరణలోకి వచ్చి గేదె దూడను కరి చి గాయపరిచింది. ఉమ కుక్కును అదిలించడానికి రావడంతో పిచ్చికుక్క అమైపె కూడా దాడి చేసి కరిచింది. ఉమ అరుపులు విని ఇంట్లో నుంచి బయటకు వచ్చిన కుటుంబ సభ్యులపై కూడా పిచ్చికుక్క దాడిచేసింది. స్థానికులు కర్రలు తీసు కుని వెంట పడగా కుక్క పారిపోయింది. క్షతగాత్రులను చికిత్సనిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గ్రామాల్లో కుక్కల బెడద తీవ్రంగా ఉందని మున్సిపల్‌ అధికారులు కుక్క ల బెడదను తొలగించాలని పలువురు స్థానికులు కోరుతున్నారు.

19న రాష్ట్రస్థాయి  అండర్‌–14 చెస్‌ టోర్నీ1
1/3

19న రాష్ట్రస్థాయి అండర్‌–14 చెస్‌ టోర్నీ

19న రాష్ట్రస్థాయి  అండర్‌–14 చెస్‌ టోర్నీ2
2/3

19న రాష్ట్రస్థాయి అండర్‌–14 చెస్‌ టోర్నీ

19న రాష్ట్రస్థాయి  అండర్‌–14 చెస్‌ టోర్నీ3
3/3

19న రాష్ట్రస్థాయి అండర్‌–14 చెస్‌ టోర్నీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement