
ఆస్తి గొడవల్లో ఉద్రిక్తత
ఖమ్మంక్రైం: డోర్నకల్ మండలానికి చెందిన ఓ వ్యక్తి, ఆయన అనుచరులు తమను బెదిరిస్తున్నారని, ఖమ్మం లో అరాచకం సృష్టిస్తున్నారంటూ అధికార పార్టీ కార్పొరేటర్ మిక్కిలినేని మంజుల – నరేంద్ర దంపతులు శనివారం రాత్రి ధర్నాకు దిగారు. ఖమ్మం వీడీవోస్ కాలనీకి చెందిన సోదరుల మధ్య ఆస్తి గొడవలు జరుగుతుండగా, తమ్ముడి వైపు డోర్నకల్ వాసి వకాల్తా పుచ్చుకుని అన్నతరఫు వారితో ఘర్షణ పడుతున్నారు. కొద్దినెలల క్రితం సదరు సోదరుల తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన తన చావుకు కారణమంటూ కొందరి పేర్లతో లేఖ రాయడంతో టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. మళ్లీ ఇటీవల వివాదం పెరగడంతో ఇంటి ముందు పోలీస్ పికెట్ ఏర్పాటు చేశా రు. ఈ ఇంటి సమీపానే కార్పొరేటర్ మంజుల కుటుంబం నివసిస్తుండగా ప్రతిరోజు గొడవ ఏమిటని డోర్నకల్ వాసిని అడగడంతో ఆయన బెదిరించినట్లు మా ట్లాడగా మంజుల తన అనుచరులతో ఆందోళనకు దిగారు. సదరు ఇంటిని ఆక్రమించుకున్న వారిని బయటకు పంపాలని రాళ్లు రువ్వడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో టూటౌన్ సీఐ బాలకృష్ణ, సిబ్బందితో చేరుకుని డోర్నకల్ వాసి అనుచరులను స్టేషన్‌కు తరలించారు.
శాంతిభద్రతల పరిరక్షణ ప్రభుత్వ బాధ్యత
ఖమ్మంఅర్బన్: ఖమ్మం వీడీవోస్ కాలనీలో జరిగిన ఘటనపై రాష్ట్రమంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పం దించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలుచేపట్టాలని సీపీని ఆదేశించారు. శాం తిభద్రతల పరిరక్షణ, సామరస్య వాతావరణాన్ని నెలకొల్పడం ప్రభుత్వ బాధ్యత అని వెల్లడించారు. కుటుంబ, వ్యక్తిగత తగాడాలను చట్టబద్ధంగా పరిష్కరించుకోవాలని సూచించారు
తరచూ ఘర్షణపై కార్పొరేటర్ దంపతుల ధర్నా