
శాశ్వత పరిష్కారం
గత లోక్‌అదాలత్‌ల్లో
పరిష్కారమైన కేసులు
జిల్లా కోర్టుల్లో ప్రత్యేక బెంచ్‌ల ఏర్పాటు
సద్వినియోగం చేసుకోవాలి
సత్వర న్యాయం..
ఖమ్మంలీగల్: కోర్టుల్లో కేసుల పరిష్కారంలో జా ప్యాన్ని నివారించేందుకు ప్రత్యామ్నాయంగా నిర్వహిస్తున్న లోక్‌అదాలత్‌లు కక్షిదారులకు వరంగా మారాయి. ఈ లోక్‌అదాలత్‌ల నిర్వహణతో రాజీపడదగిన అనేక కేసులకు పరిష్కారం లభిస్తోంది. ప్రతీ లోక్‌అదాలత్‌లో వేలాది కేసులను పరిష్కరి స్తుండగా కక్షిదారుల సమయం, డబ్బు వృథా అవుతున్నాయి. అంతేకాక కేసులకు శాశ్వత, అంతిమ పరిష్కారం అందుతోంది.
అందరికీ న్యాయసాయం కోసం..
ప్రభుత్వం 1987లో న్యాయసేవాధికార చట్టాన్ని ప్రవేశపెట్టింది. డబ్బు ఉన్న వారికే న్యాయం సొంతం అనే అపోహను తొలగించేలా రాజ్యాంగంలోని 39వ అధికరణ ద్వారా పార్లమెంట్ ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. పేదలకు న్యాయ సాయం అందించేలా న్యాయ విజ్ఞాన సదస్సులు, కేసుల సత్వర పరిష్కారానికి లోక్ అదాలత్‌లు నిర్వహిస్తున్నారు. ప్రీ లిటిగేషన్ కేసుల్లో ఎక్కువశాతం విచారణకు ముందే లోక్ అదాలత్‌ల ద్వారా పరిష్కారమవుతున్నాయి. అంతేకాక గ్రామీణ ప్రాంతాల్లో చట్టం, న్యాయంపై అవగాహన లేని వారికి సత్వరన్యాయం అందించడమే లక్ష్యంగా లోక్‌అదాలత్‌లు కొనసాగుతున్నాయి.
ప్రత్యామ్నాయ పరిష్కారం
రాజ్యాంగం కల్పించిన చట్టం, న్యాయాన్ని గ్రామీణ ప్రాంత ప్రజలకు అందించేందుకు న్యాయసేవా సంస్థలు అవతరించాయి. ‘ప్రత్యామ్నాయ పరిష్కార పద్ధతి’ సూత్రాన్ని అనుసరించి ప్రభుత్వం ప్రజా న్యాయపీఠం(లోక్ అదాలత్) ప్రక్రియను ప్రవేశపెట్టింది. న్యాయసేవాధికార సంస్థల చట్టంలోని 9వ అధికరణ ప్రకారం న్యాయపరమైన సమస్యలను ఉభయులకు నచ్చచెప్పి వారి సమ్మతితో సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తారు. ఎవరు కూడా ఆర్థిక కారణాలు, ఇతర అంశాలతో న్యాయాన్ని పొందే అవకాశం కోల్పోకుండా ఉచిత న్యాయసాయం సైతం అందిస్తున్నారు.
నేడు జాతీయ లోక్‌అదాలత్
జిల్లా కోర్టు ఆవరణతో పాటు జిల్లాలోని పలు కోర్టుల్లో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నారు. ఇందులో అత్యధిక కేసులు పరిష్కరించేలా ఇప్పటికే ముందస్తు లోక్ అదాలత్‌లు నిర్వహించారు. అలాగే పోలీసు అధికారులు, న్యాయమూర్తులు, న్యాయవాదులు, బీమా కంపెనీ ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి ఎక్కువ కేసులు పరిష్కరించేలా జిల్లా ప్రధాన న్యాయమూర్తి రాజగోపాల్ ప్రత్యేక చొరవ చూపారు.
ప్రత్యేక బెంచ్‌ల ఏర్పాటు
జిల్లా కోర్టులో శనివారం లోక్ అదాలత్ నిర్వహణకు ఎనిమిది బెంచ్‌లు ఏర్పాటు చేశారు. ఆయా బెంచ్‌లకు మూడు అదనపు జిల్లా జడ్జి రాంప్రసాదరావు, అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి టి.మురళీమోహన్, డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి కే.వీ.చంద్రశేఖర్‌రావు, ప్రి న్సిపల్ జూనియర్ సివిల్‌జడ్జి కె.దీప, అడిషనల్ జూ నియర్ సివిల్ జడ్జిలు బి.రజిని, వై.బిందుప్రియ, వి.మాధవి, బి.నాగలక్ష్మి నేతృత్వం వహిస్తారు.
నిర్వహణ పరిష్కారమైన కేసులు
మార్చి 2024 7,665
జూన్ 2024 10,712
డిసెంబర్ 2024 8,519
మార్చి 2025 19,345
నేడు జాతీయ లోక్‌అదాలత్
జిల్లాలోని కోర్టుల్లో శనివారం జరిగే జాతీయ లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలి. రాజీ మార్గమే రాజమార్గంగా భావిస్తే కేసులు పరిష్కరించుకోవచ్చు. ఇరువర్గాలు రాజీపడితే సత్వర న్యాయం అందుతుంది. జిల్లాలో అత్యధిక కేసులు పరిష్కారమయ్యేలా కక్షిదారులు ముందుకు రావాలి.
– జి.రాజగోపాల్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి