
రేషన్ షాప్‌ల్లో డీఎస్‌ఓ తనిఖీ
ఏన్కూరు: మండలంలోని పలు గ్రామాల్లో రేషన్ షాప్‌లను డీఎస్‌ఓ చందన్‌కుమార్ శుక్రవారం తనిఖీ చేశారు. రాజలింగాల, తిమ్మారావుపేట, శ్రీరాంపురంతండాల్లో షాపుల ద్వారా బియ్యం పంపిణీని పరిశీలించిన ఆయన డీలర్లకు సూచచనలు చేశారు. లబ్ధిదా రులకు సమస్యలు ఎదురైతే హెల్ప్‌లైన్ నంబర్ 98682 00445కు ఫిర్యాదు చేయాలని తెలిపారు. ఆర్‌ఐ వీరయ్య పాల్గొన్నారు.
నేడు సురవరం
సంస్మరణ సభ
ఖమ్మంమయూరిసెంటర్: సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి సంస్మరణ సభ శనివారం ఖమ్మంలో నిర్వహించనున్నారు. సాయంత్రం 5గంటలకు భక్తరామదాసు కళాక్షేత్రంలో సభ మొదలవుతుందని సీపీఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్ తెలిపారు. ఈ సభలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, జాతీయ సమితి సభ్యుడు హేమంతరావు తదితరులు పాల్గొంటారని వెల్లడించారు.
ఖమ్మం మీదుగా
వారాంతపు రైలు
ఖమ్మం రాపర్తినగర్: చర్లపల్లి – అనకాపల్లి నడుమ ఈనెల 13నుంచి వారాంతపు రైలు ప్రారంభమవుతుందని అధికారులు వెల్లడించారు. చర్లపల్లిలో ప్రతీ శనివారం రాత్రి 8గంటలకు బయలుదేరే రైలు ఆదివారం తెల్లవారుజామున 4గంటలకు అనకాపల్లికి చేరుతుందని తెలిపారు. ఈ రైలు ఖమ్మంకు రాత్రి 11–11గంటలకు వస్తుందని పేర్కొన్నారు. తిరుగు ప్రయాణంలో అనకాపల్లి–చర్లపల్లి రైలు అర్ధరాత్రి 1–28 గంటలకు ఖమ్మం స్టేషన్‌కు వస్తుందని అధికారులు తెలిపారు.
ఉద్యోగాలకు
18 మంది ఎంపిక
ఖమ్మం రాపర్తినగర్: జిల్లా ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యాన శుక్రవారం నిర్వహించిన జాబ్ మేళాలో 18 మంది ఎంపికయ్యారు. అపోలో ఫార్మసీలో వివిధ ఉద్యోగాలకు ఇంటర్వ్యూ నిర్వహించగా హాజరైన 35 మందిలో 18 మంది ఎంపిక కాగా నియామకపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధి కల్పన శాఖఅధికారి కొండపల్లి శ్రీరాం, అపోలో ఫార్మసీ ప్రతినిధులు పాల్గొన్నారు.
17న సాయుధ పోరాట వారోత్సవాల ముగింపు సభ
ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం భక్త రామదాసు కళాక్షేత్రంలో ఈనెల 17న నిర్వహించే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారో త్సవాల ముగింపు సభకు సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంఏ.బేబీ హాజరుకానున్నారని జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మంలో శుక్రవారం నాయకులు బండి రమేశ్, వై.విక్రమ్‌తో కలిసి మాట్లాడారు. సభలో బేబీతో పాటు కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర నాయకుడు పోతినేని సుదర్శన్‌రావు, తదితరులు హాజరవుతారని తెలిపారు. ఈమేరకు సభను విజయవంతం చేయాలని కోరారు.
తపాలా బీమాను సద్వినియోగం చేసుకోవాలి
తిరుమలాయపాలెం: తపాలా శాఖ అందిస్తున్న బీమా పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పోస్టల్ శాఖ సూపరింటెండెంట్ వీరభద్రస్వామి సూచించారు. పోస్టల్ బీమా తీసుకుని ఇటీవల ప్రమాదానికి గురైన మండలంలోని తిప్పారెడ్డిగూడెం వాసి వేల్పుల భద్రమ్మకు రూ.1,08,000 చెక్కును శుక్రవారం ఆయన అందజేసి మాట్లాడారు. తక్కువ ప్రీమియంతో పథకాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. పోస్టల్ శాఖ ఇన్‌స్పెక్టర్ కాళీ మహేశ్వరి, ఉద్యోగులు రాజేష్, వెంకయ్య, పాండు, సారయ్య పాల్గొన్నారు.
భద్రాచలం ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
ఖమ్మంమయూరిసెంటర్: భద్రాచలం ఆర్టీసీ డిపోలో పెరిగిన పనిభారం, మస్టర్ల కుదింపునకు వ్యతిరేకంగా ఐదు రోజుల నుంచి అక్కడి ఉద్యోగులు చేస్తున్న పోరాటానికి ఖమ్మం రీజియన్ ఆర్టీసీ జేఏసీ మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా శుక్రవారం ఖమ్మంలో పర్సనల్ ఆఫీసర్ సంపత్‌కుమార్‌కు వినతిపత్రం అందజేసి సమస్యను పరిష్కరించాలని కోరారు. భద్రాచలం డిపో మేనేజర్ కార్మికులపై భారం మోపుతూ మస్టర్లు కుదిస్తున్నారని తెలిపారు. నాయకులు ఏ.కృష్ణ, వినోదరావు, పి.సుధాకర్, జి.మాధవరావు, పి.రమేష్, బుచ్చిబాబు, బి.హన్మంతరావు, ఆర్.టీ.రావు పాల్గొన్నారు.