
టీఎన్జీవోస్ మున్సిపల్ ఫోరం కమిటీ ఎన్నిక
ఖమ్మంమయూరిసెంటర్: టీఎన్జీవోస్ అనుబంధ మున్సిపల్ ఫోరం నూతన కమిటీని ఖమ్మంలో శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సత్తుపల్లి, మధిర, వైరా, కల్లూరు, ఏదులాపురం మున్సిపాలిటీలతో పాటు ఖమ్మం కార్పొరేషన్ ఉద్యోగులు పాల్గొనగా.. ఒక్కో సెట్ నామినేషన్లే దాఖలు కావడంతో ఎన్నిక ఏకగ్రీవమైందని ఎన్నికల అధికారి తాళ్లూరి శ్రీకాంత్ ప్రకటించారు. ఫోరం అధ్యక్షుడిగా ఏ.సుధాకర్, అసోసియేటెడ్ అధ్యక్షుడిగా ఈ.ఉదయ్ కుమార్, ఉపాధ్యక్షులుగా ఎం.శ్రీనివాస్, కె.లింగయ్య, జె.నాగరాజు, జె.సుచిత, కార్యదర్శిగా జి.శ్రీనివాసరావు ఎన్నికయ్యారు. అలాగే, సంయుక్త కార్యదర్శులుగా ఎం.సాంబయ్య, సీహెచ్.శ్రీనివాస్, జె.రాంబాయి, ఏ.ప్రేమ్‌కుమార్‌రెడ్డి, కోశాధికారిగా బి.నాగేశ్వరరావుతో పాటు ఇతర పదవులకు బి.సుధీర్, కె.శ్రీకాంత్, అవినాష్, కే.హేమనాథ్‌సాయి, ఎం.ప్రవీణ్ కుమార్, పి.రజిని, కృష్ణకుమారి, కవిత, అనురాధ ఎన్నికయ్యా రు. నూతన కార్యవర్గాన్ని టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గుంటుపల్లి శ్రీనివాసరావు, కొణిదెన శ్రీనివాస్ అభినందించారు. ఇంకా ఈ కార్యక్రమంలో కొమరగిరి దుర్గాప్రసాద్, జెడ్.ఎస్.జైపాల్, యర్రా రమేష్, లలితకుమారి, ప్రభాకరాచారి, రుక్మారావు, దిలీప్ తదితరులు పాల్గొన్నారు.

టీఎన్జీవోస్ మున్సిపల్ ఫోరం కమిటీ ఎన్నిక