
అటు మూత.. ఇటు వెత
ఖమ్మంలోని కాల్వొడ్డు మున్నేరు పాత
వంతెనపై రాకపోకలపై నియంత్రణ విధించారు. ఇక్కడ తీగల వంతెన నిర్మాణ పనులతో ప్రతిరోజు ఉదయం 11నుంచి సాయంత్రం
4గంటల వరకు ఎలాంటి వాహనాలను
అనుమతించబోమని అధికారులు ప్రకటించారు. ఈ సమయాన వాహనాలను కరుణగిరి బ్రిడ్జి మీదుగా మళ్లించారు. ఫలితంగా బ్రిడ్జిపై రద్దీ నెలకొని వాహనదారులు ఇక్కట్లు
ఎదుర్కొన్నారు. – స్టాఫ్ ఫొటోగ్రాఫర్