
ప్రశ్నించడమే నేరమా?
ప్రజాస్వామ్యంలో పత్రికల పాత్ర ఎంతో కీలకం. ప్రభుత్వాలు – ప్రజలకు మధ్య వారధిలా పత్రికలు పని చేస్తుంటాయి. అలాంటి పత్రికల్లో వచ్చే కథనాలను జీర్ణించుకోలేక ఎడిటర్లపై ఏపీ ప్రభుత్వం కేసులు నమోదు చేయడం, జర్నలిస్టులను భయభ్రాంతులకు గురి చేయడం సరికాదు. తక్షణమే సాక్షి ఎడిటర్ ధనుంజయ్‌రెడ్డి, జర్నలిస్టులపై పెట్టిన కేసులను ఏపీ ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి.
– పువ్వాళ్ల దుర్గాప్రసాద్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు
చంద్రబాబు ప్రభుత్వం జర్నలిస్టుల హక్కులను కాలరాసేలా వ్యవహరిస్తోంది. కక్షగట్టి సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డిపై కేసు నమోదు చేయడం అన్యాయం. ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభమైన జర్నలిజం, జర్నలిస్టుల హక్కుల రక్షణకు పాలకులు పాటుపడాలి. అంతేతప్ప ప్రభుత్వం – ప్రజలకు వారధిగా ఉంటూ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే జర్నలిస్టులపై కేసులు నమోదు చేయడం సరికాదు. ఇలాంటి ఘటనలను ఫాసిస్టు చర్యగా భావిస్తున్నాం.
– ఆకుతోట ఆదినారాయణ,
టీయూడబ్ల్యూజే(టీజేఎఫ్), జిల్లా అధ్యక్షుడు
ఏపీలో పౌరహక్కులు, జర్నలిస్టుల స్వేచ్ఛపై ఉక్కుపాదం ● అక్కడి ప్రభుత్వ తీరును తప్పుపడుతున్న పలువురు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పౌరహక్కులు, జర్నలిస్టుల స్వేచ్ఛపై అక్కడ టీడీపీ
ఆధ్వర్యాన అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది.
గడిచిన మే నెలలో ‘సాక్షి’ దినపత్రిక విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, మంగళగిరి, రాజమండ్రి, ఏలూరు, శ్రీకాకుళం జిల్లా కార్యాలయాలపై టీడీపీ శ్రేణులు మూకదాడులకు దిగాయి. ఈ విషయంలో దోషులను శిక్షించాలని ‘సాక్షి’ జర్నలిస్టులు పోలీస్‌స్టేషన్లలో లిఖిత పూర్వక ఫిర్యాదు చేసినా కేసులు నమోదు చేయలేదు. ఇదే సమయాన ఎన్నికల
ముందు ఇచ్చిన హామీల అమలులో
జరుగుతున్న జాప్యం, మోసాలపై ఆంధ్రప్రదేశ్ ప్రజలు, కార్మికులు, మహిళలు, ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగుల పక్షాన వార్తల రూపంలో ప్రశ్నిస్తున్న జర్నలిస్టులపై
కొందరు ఉద్యోగులతో ఫిర్యాదులు
ఇప్పిస్తూ తక్షణమే కేసులు నమోదు
చేస్తున్నారు. ఇందులో భాగంగానే వివిధ అంశాలపై ప్రతిపక్ష పార్టీల నాయకులు ఏర్పాటుచేసే ప్రెస్ కాన్ఫరెన్స్‌ల వార్తలు రాసిన ‘సాక్షి’ దినపత్రికతో పాటు ఎడిటర్, ఇతర జర్నలిస్టులపై కేసులు నమోదు చేస్తూ రాజ్యాంగం ప్రసాదించిన భావ
ప్రకటనా స్వేచ్ఛను తమ గుప్పిట్లోకి
తీసుకునేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ప్రభుత్వంలోని కొందరు పెద్దలు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసుకుని దాడులు, కేసులు, పోలీసులతో కార్యాలయాలు, జర్నలిస్టుల ఇళ్లలో తనిఖీల పేరుతో భయభ్రాంతులకు గురిచేస్తోంది. పత్రికా స్వేచ్ఛను హరిస్తూ, ప్రజల పక్షాన పనిచేసే జర్నలిస్టుల గొంతు నొక్కేస్తున్న ఏపీ ప్రభుత్వ అప్రజాస్వామిక చర్యలను పలువురు తప్పుపడుతున్నారు.
– ఖమ్మం సహకారనగర్
ఆంధ్రప్రదేశ్‌లో జర్నలిస్టులను భయభ్రాంతులకు గురిచేసేలా కుట్ర జరుగుతోంది. జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకుని అక్కడి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. జర్నలిస్టులను ఏదోలా లోబర్చుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఏపీలో సాక్షిపై, జర్నలిస్టులపై దాడులు జరుగుతున్నాయి. ఆధారాలు లేకున్నా సాక్షి ఎడిటర్ ధనుంజయ్‌రెడ్డిపై అక్కడి ప్రభుత్వం కక్ష సాధింపుగా వ్యవహరించడాన్ని మానుకోవాలి.
– కొత్తపల్లి శ్రీనివాసరెడ్డి,
టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి

ప్రశ్నించడమే నేరమా?

ప్రశ్నించడమే నేరమా?

ప్రశ్నించడమే నేరమా?