
యూరియా కోసం పడిగాపులు
నేలకొండపల్లి: యూరియా సరఫరాలో అవాంతరాలతో రైతులు పడుతున్న ఇక్కట్లు తీరడం లేదు. మండలంలోని 10 పీఏసీఎస్‌లతో పాటు మరో ఐదు సబ్ సెంటర్లకు 110 చొప్పున యూరియా బస్తాలు సరఫరా చేశారు. అయితే, ప్రతీ కేంద్రం వద్దకు బుధవారం వందలాదిగా రైతులు రావడంతో ఒక్కో బస్తా మాత్రమే కూపన్ల ఆధారంగా పంపిణీ చేశారు. కానీ, కొన్నిచోట్ల 110 బస్తాలకు 200 కూపన్లు జారీ చేయడంతో మిగతా వారు అధికారులను నిలదీశారు. ఖమ్మం ఆర్‌డీఓ నరసింహారావు పలు కేంద్రాల్లో యూ రియా పంపిణీ పర్యవేక్షించారు. తహసీల్దార్ వి.వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ యర్రయ్య, ఏఓ ఎం.రాధ తదితరులు పాల్గొన్నారు. కాగా, మండలంలోని రాజారాంపేట సొసైటీ వద్ద రైతులు యూరియా కోసం ఆందో ళన చేశారు. కేంద్రం ఇన్‌చార్జ్, ఎంపీఓ శివ రైతులతో వాగ్వాదానికి దిగడం ఉద్రిక్తతకు దారి దీసింది.
తిరుమలాయపాలెం: యూరియా కోసం రైతులు తెల్లవారుజాము నుంచే క్యూ కట్టారు. సుబ్లేడు, కాకరవాయి, తెట్టెలపాడు, ఎర్రగడ్డ, బీరోలు తదితర గ్రామాలకు రైతులు అధిక సంఖ్యలో రావడంతో ఎస్‌ఐ జగదీశ్ ఆధ్వర్యాన బందోబస్తు ఏర్పాటు చేశారు. మండలంలోని 14 కేంద్రాల్లో ఒక్కో రైతుకు ఒక బస్తా చొప్పున 1,540 మందికి పంపిణీ చేశారు. ఇంకా చాలా మందికి అందకపోవడంతో కూపన్లు జారీ చేశారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవ సరం లేదని, రెండు వారాల్లో అందరికీ యూరియా అందిస్తామని ఏఓ సీతారాంరెడ్డి తెలిపారు.
కూసుమంచి: మండలానికి 1,870 బస్తాల యూరియా రావడంతో కల్లూరుగూడెం, చేగొమ్మ, జక్కేపల్లి పీఏసీఎస్, మరో 14 సబ్‌సెంటర్ల బస్తాలు పంపిణీ చేశారు. మిగతా వారికి యూరియా అందకపోవడంతో నిరాశగా వెనుదిరిగారు. తహసీల్దార్ రవికుమార్, ఏడీఏ సతీశ్, ఎంపీడీఓ పర్యవేక్షించారు.

యూరియా కోసం పడిగాపులు

యూరియా కోసం పడిగాపులు