
ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పోరాటాలు
ఖమ్మంసహకారనగర్: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్‌పీసీ) ఆధ్వర్యాన నిర్వహించే పోరాటాలను జయప్రదం చేయాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావా రవి పిలుపునిచ్చారు. ఖమ్మంలో సోమవారం టీఎస్‌యూటీఎఫ్ జిల్లా కమిటీ సమావేశం షేక్ రంజాన్ అధ్యక్షతన జరగగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 19నెలలు గడిచినా ఉద్యోగ, ఉపాధ్యాయులకు పీఆర్‌సీ ఇవ్వకుండా జాప్యం చేస్తోందన్నారు. ఇకనైనా పీఆర్‌సీ అమలుచేయడమే కాక ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల షెడ్యూల్ ప్రకటించాలని, పెండింగ్ బిల్లులు విడుదల చేయాలనే డిమాండ్‌తో చేపట్టే దశలవారీ పోరాటంలో ఉపాధ్యాయులు పాల్గొనాలని కోరారు. ఈ సమావేశంలో జీ.వీ.నాగమల్లేశ్వరరావు, పారుపల్లి నాగేశ్వరరావు బుర్రి వెంకన్న, వల్లంకొండ రాంబాబు, దామోదర్, అరవింద్, రాంచంద్ పాల్గొన్నారు.
జయప్రదం చేయండి..
ఉపాధ్యాయ సమస్యలపై దశలవారీ పోరాటాలను జయప్రదం చేయాలని టీపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి వై.పద్మ పిలుపునిచ్చారు. ఖమ్మంలోని యూనియన్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోసం ఈనెల 23, 24వ తేదీల్లో తహసీల్దార్లకు వినతిపత్రాలు ఇవ్వనుండగా, ఆగస్టు 1న జిల్లా కేంద్రంలో, ఆగస్టు 23న రాష్ట్రస్థాయిలో మహాధర్నా ఉంటుందని తెలిపారు. ఈ సమావేశంలో టీపీటీఎఫ్ కార్యదర్శి ఆకుల నాగేశ్వరరావు, నాయకులు గరిక శ్రీనివాస్, హన్మంతరావు, దామోదర్ తదితరులు పాల్గొన్నారు.