
సమష్టి నిర్ణయంతో బాధ్యతలు నిర్వర్తించండి
ఖమ్మంమయూరిసెంటర్: సీపీఐ జిల్లా సమితి బాధ్యులు సమష్టిగా నిర్ణయాలు తీసుకుంటూ పార్టీ పటిష్టతకు పాటుపడుతూనే ప్రజల సమస్యలపై ఉద్యమించాలని పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు సూచించారు. ఇటీవల మహాసభల్లో జిల్లా కార్యదర్శిగా ఎన్నికై న దండి సురేష్, సహాయ కార్యదర్శిగా ఎన్నికై న జమ్ముల జితేందర్‌రెడ్డి సోమవారం జిల్లా కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కూనంనేని పాల్గొని వారిని సన్మానించాక మాట్లాడారు. పాలక వర్గాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై బహుముఖ పోరాటాలకు కేడర్‌ను సిద్ధం చేయాలన్నారు. అలాగే, పార్టీ శత వసంతాల ముగింపు సభ డిసెంబర్ 26న ఖమ్మంలో జరగనుండగా ఇప్పటి నుంచే ఏర్పాట్లపై దృష్టి సారించాలని సూచించారు. అలాగే, కార్యదర్శి దండి సురేష్, సహాయ కార్యదర్శిగా ఎన్నికై న జమ్ముల జితేందర్‌రెడ్డి తదితరులు పార్టీ జాతీయ సమితి సభ్యుడు బాగం హేమంతరావుతో కలిసి పార్టీ సీనియర్ నాయకుడు పువ్వాడ నాగేశ్వరరావును కలిశారు.ఈ సందర్భంగా పార్టీ బలోపేతం, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమాల్లో నాయకులు కొండపర్తి గోవిందరావు, సిద్దినేని కర్ణకుమార్, శింగు నర్సింహారావు, తాటి వెంకటేశ్వరరావు, యర్ర బాబు, రావి శివరామకృష్ణ, పుచ్చకాయల కమలాకర్, మేకల శ్రీనివాసరావు, రవీంద్రబాబు, యానాలి సాంబశివరెడ్డి, కౌన్సిల్ సభ్యులు నూనె శశిధర్ తదితరులు పాల్గొన్నారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి సాంబశివరావు