
గెలుపే లక్ష్యంగా ప్రణాళిక
ఖమ్మం మామిళ్లగూడెం: త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలను బీజేపీ శ్రేణులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయమే లక్ష్యంగా పనిచేయాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు సూచించారు. ఖమ్మంలో సోమవారం నిర్వహించిన ప్రత్యే క కార్యశాలలో ఆయన మాట్లాడారు. వచ్చే ఎన్నికలు నాయకులవి కాక కార్యకర్తలవిగా భావించాలని తెలిపారు. గ్రామాల అభివృద్ధికి కేంద్రప్రభుత్వం నుంచి అత్యధిక నిధులు వస్తున్న అంశాన్ని ప్రజల్లో విస్తృతంగా తీసుకెళ్లాలని చెప్పారు. రాష్ట్రంలో ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు అనర్హులలకే అందుతున్న అంశాన్ని వివరించాలని పేర్కొన్నారు. గ్రామీణ స్థాయిలోని ప్రతీ స్థానంలో బీజేపీ శ్రేణులు పోటీ దిగేలా కార్యచరణ సిద్ధం చేసుకోవాలని సూచించా రు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు మాట్లాడుతూ రుణమాఫీ, వరి ధాన్యం సాగుచేసిన రైతులకు బోనస్ చెల్లింపులో ప్రభుత్వం విఫలమైన తీరును ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించాలని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా కన్వీనర్ ఈ.వీ.రమేష్, నాయకులు గెంటాల విద్యాసాగర్, దొంగలు సత్యనారాయణ, సన్నే ఉదయ్‌ప్రతాప్, వాసుదేవరావు, డి.వెంకటేశ్వరావు, నున్నా రవి, రామలింగేశ్వరరావు, మేకల నాగేందర్, రుద్ర ప్రదీప్, కుమిలి శ్రీనివాస్, రుద్రగాని మాధవ్, పుల్లారావు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు