
30 కేజీల గంజాయి స్వాధీనం
ఖమ్మంక్రైం: ఖమ్మం కొత్త బస్టాండ్ సమీపాన సోమవారం ఉదయం చేపట్టిన తనిఖీల్లో 30 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నామని ఎకై ్సజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్‌ఐ సీహెచ్.శ్రీహరిరావు తెలిపారు. ఎన్‌ఫోర్స్ సిబ్బంది తనిఖీలు చేపడుతుండగా బస్టాండ్ సమీపంలో రెండుప్లాస్టిక్ సంచులను గుర్తించారు. అందులో పరిశీలించగా 30కేజీల గంజాయి లభించగా, బాధ్యుల కోసం పరిసరాల్లో గాలించినా ఫలితం కానరాలేదని తెలిపారు. ఈ మేరకు గంజాయిని ఖమ్మం–1 ఎకై ్సజ్ స్టేషన్‌లో అప్పగించామని వెల్లడించారు. తనిఖీల్లో ఉద్యోగులు కరీం, బాలు, సుధీర్, వెంకట్, విజయ్,హన్మంతరా వు, వీరబాబు, స్వరూప, ఉపేందర్ పాల్గొన్నారు.
6.64 క్వింటాళ్ల గంజాయి దహనం
తల్లాడ: ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో కొద్దిరోజులుగా ఎకై ్సజ్ అధికారులు స్వాధీనం చేసుకున్న 6.64 క్వింటాళ్ల గంజాయిని సోమవారంతల్లాడ మండలం గోపాలపేటలో ఏడబ్ల్యూఎం బర్నింగ్ ప్లాంట్‌లో దహనం చేయించారు. ఖమ్మం జిల్లాలో పట్టుబడిన 1.82 క్వింటాళ్లు, భద్రాద్రిజిల్లాలో 4.82 క్వింటాళ్ల గంజాయి ఇందులో ఉందని ఎక్సైజ్ అధికారులు తెలిపారు.
హత్య కేసులో ఒకరికి జీవిత ఖైదు
ఖమ్మం లీగల్: కేసు విషయమై రాజీ చేస్తామంటూ నమ్మించి ఓ యువకుడి హత్యకు కారణమైన వ్యక్తికి జీవిత ఖైదుతో పాటు రూ.10వేల జరిమానా విధిస్తూ ఖమ్మం ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి డి.రాంప్రసాద్‌రావు సోమవారం తీర్పు చెప్పారు. ఖమ్మంకు చెందిన శివను ఒక కేసు విషయంలో రాజీ చేస్తామని బీ.కే.బజార్ చెందిన ఉల్లోజు నాగరాజు నమ్మించాడు. ఈమేరకు 2024 జనవరి 22న శివను పిలిపించి నాగరాజుతో పాటు ఫిరంగి సాయి, ఫిరంగి కుమార్ కర్రలతో దాడి చేశారు. దీంతో తీవ్రంగా గాయపడిన శివ మృతి చెందగా ఆయన తండ్రి నారాయణ ఫిర్యాదుతో ఖమ్మం వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, కేసును విచారణ అనంతరం ఏ1గా నాగరాజుపై నేరం రుజువు కావడంతో జీవితఖైదుతో పాటు జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. మిగతా ఇద్దరిపై నేరంరుజువు కాకపోవడంతో నిర్దోషులుగా ప్రకటించారు. ప్రాసిక్యూషన్ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ బి.కృష్ణమోహన్రావు వాదించగా, సిబ్బంది రామకృష్ణ, శ్రీకాంత్, చిట్టిబాబు సహకరించారు.